చంద్రబాబు కాన్వాయ్ రూట్ మార్చిన పోలీసులు

చంద్రబాబు కాన్వాయ్ రూట్ మార్చిన పోలీసులు

టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్ట్ విషయంలోనే పోలీసులు హైడ్రామా క్రియేట్ చేశారంటే.. ఇప్పుడు చంద్రబాబును కాన్వాయ్‌లో తరలిస్తున్న విషయంలో కూడా హైడ్రామా క్రియేట్ చేస్తున్నారు. చంద్రబాబు కాన్వాయ్‌లో పోలీసుల  ఓవరాక్షన్ అంతా ఇంతా కాదు. చంద్రబాబు కాన్వాయ్‌ని ఎవరూ రీచ్ కాకుండా పోలీసులు అడుగడునా అడ్డుపడుతున్నారు. చంద్రబాబు కాన్వాయ్‌లో అంబులెన్స్ -ఫైర్ ఇంజన్ బండ్లు ఏవీ లేకుండా చూశారు.  కావాలని చంద్రబాబు దగ్గరికి వెళ్లకుండా 108కి  తమ వాహనాన్ని అడ్డుగా పెట్టి పోలీసులు నడుపుతుండటం గమనార్హం. అంతేకాకుండా చంద్రబాబు కాన్వాయ్ రూట్ సైతం మార్చేశారు. బేస్తవారిపేట నుంచి ఒంగోలు వైపు వాహన శ్రేణి మళ్ళింది. బెస్తవారిపేట , పొదిలి, దర్శి, అద్దంకి, చిలకలూరిపేట, గుంటూరు మీదుగా చంద్రబాబును పోలీసులు విజయవాడ తీసుకెళుతున్నారు. అసలు చంద్రబాబును అరెస్ట్ చేసి తీసుకెళుతున్నప్పటి నుంచే పోలీసులు హైడ్రామా క్రియేట్ చేస్తున్నారు. ఎక్కడికి తీసుకెళుతున్నారనే విషయాన్ని కూడా ఎవ్వరికీ తెలియనివ్వడం లేదు. చంద్రబాబు అరెస్ట్ విషయంలో ఇంత సీన్ ఎందుకు క్రియేట్ చేస్తున్నారనేది తెలియడం లేదు.