కర్నాటకలో కాంగ్రెస్​ వస్తే తెలంగాణలోనూ అధికారంలోకి వస్తాం

కర్నాటకలో కాంగ్రెస్​ వస్తే తెలంగాణలోనూ అధికారంలోకి వస్తాం

మీడియాతో టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్​ రెడ్డి చిట్​చాట్​ చేశారు. కర్నాటకలో కాంగ్రెస్​ గెలుపు ఖాయమన్నారు. కర్నాటకలో కాంగ్రెస్​ వస్తే తెలంగాణలోనూ కాంగ్రెస్​దే అధికారమన్నారు. బీజేపీని గెలిపించడానికి కేసీఆర్​ పనిచేశారని చెప్పారు. జేడీఎస్​తో కలిసి బీజేపీ అధికారంలోకి వచ్చేలా కేసీఆర్​ ప్లాన్​ చేశారని అన్నారు. కుమారస్వామి సింగపూర్​లో ఉంటే కేసీఆర్​ ఫామ్​ హౌస్​లో ఉండి చక్రం తిప్పుతున్నారని అన్నారు. కర్నాటకలో ఎంఐఎం ఎందుకు పోటీ చేయలేదని రేవంత్​ ప్రశ్నించారు. బీజేపీ, బీఆర్​ఎస్​ ఒక్కటేనని కర్నాటక ఎన్నికల్లో స్పష్టమైందని అన్నారు.