రూ. 48 కోట్ల వ్యయంతో సిద్దిపేటలో ఐటీ టవర్ నిర్మాణం

రూ. 48 కోట్ల  వ్యయంతో  సిద్దిపేటలో ఐటీ టవర్ నిర్మాణం
  • ఈనెల 13న జాబ్ మేళా 
  • ఈనెల 15న ఐటీ టవర్ ప్రారంభం
  • సిద్దిపేటకు మరో ప్రత్యేక గుర్తింపు

ముద్ర ప్రతినిధి, సిద్దిపేట: అభివృద్ధిలో దూసుకుపోతున్న సిద్దిపేటలో ఉపాధి, ఉద్యోగ అవకాశాలకు మరో వేదిక సిద్ధమైంది. ఐటీ కొలువుల కోసం ఇక హైదరాబాదు వెళ్ళనవసరం లేకుండా స్థానికంగానే ఆ కొలువులు సాధించుకోవడానికి విద్యార్థులకు అవకాశం లభించింది. సిద్దిపేట నుంచి హైదరాబాద్ వెళ్లే ప్రధాన రహదారి (రాజీవ్ రహదారి)పై ఎల్వి ప్రసాద్ ఐ ఇన్స్టిట్యూట్ వద్ద ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మించిన ఐటీ టవర్ ప్రారంభానికి సిద్ధమైంది దీంతో సాఫ్ట్వేర్ కొలువుల కోసం నిరుద్యోగ యువతకు జాబ్ మేళాను నిర్వహిస్తున్నారు. 48 కోట్ల రూపాయల వ్యయంతో నాలుగు అంతస్తుల్లో నిర్మించిన ఐటీ సౌదాన్ని ఈ నెల 15న రాష్ట్ర మంత్రులు ప్రారంభించనున్నారు. దాదాపు పది ఐటీ కంపెనీలు ఈ టవర్ లో ప్లేస్మెంట్ తీసుకొని సాఫ్ట్వేర్ ఉద్యోగులతో పనులు చేయించనున్నాయి అందుకోసం ఈనెల 13న మెగా జాబ్ మేళా ను ఐటి టవర్ పక్కనే ఉన్న పోలీస్ కమిషనరేట్ లో ఇంటర్వ్యూలు నిర్వహించనున్నారు.

ఐటీ టవర్ విశిష్టతలు.. సిద్దిపేట సమీపాన హైవే మీద నిర్మించిన ఐటీ సౌదం ప్రత్యేకతలు