ఆరోగ్య సిద్దిపేట, స్వచ్ఛ సిద్దిపేట కై 33 వార్డులో  కౌన్సిలర్ల పర్యటన

ఆరోగ్య సిద్దిపేట, స్వచ్ఛ సిద్దిపేట కై 33 వార్డులో  కౌన్సిలర్ల పర్యటన

ముద్ర ప్రతినిధి, సిద్దిపేట: ఆరోగ్య సిద్దిపేట, స్వచ్ఛ సిద్దిపేట కై కౌన్సిలర్లు చేపట్టిన వార్డుల పర్యటన కొనసాగుతోంది. స్వచ్ఛ సిద్దిపేటలో భాగంగాప్రతిరోజు వార్డులో నడుస్తూ చెత్త వేరటం వలన పట్టణం పరిశుభ్రంగా ఉంటుందని,వాకింగ్ చేయడం వల్ల  సంపూర్ణ ఆరోగ్య వంతుల అవుతారని  మంత్రి తన్నీరు హరీష్ రావు  చేసిన సూచనల మేరకు  బుధవారం నాడు సిద్దిపేట మున్సిపాలిటీ పరిధిలోని 33 వ వార్డులో కమిషనర్ సంపత్ కుమార్,మాజీ చైర్మన్ కడవేరుగు రాజనర్సు,వైస్ చైర్మన్ జంగిటి కనకరాజు, కౌన్సిలర్, మొయిజ్ ఇతర వార్డు సభ్యులు, మున్సిపల్ సిబ్బంది ఉదయాన్నే వార్డులలో వాకింగ్ చేస్తూ అక్కడక్కడ గల పేపర్ లు,కవర్ లను,చెత్తను ఏర్వేశారు ప్రజల్లో అవగాహన కల్పించారు.