సిద్దిపేట పోలీస్ పనితీరు భేష్ 

సిద్దిపేట పోలీస్ పనితీరు భేష్ 
  • ప్రత్యేక శైలిలో కేసులను చేదిస్తున్న సిబ్బంది
  • మల్టీ జోన్ -1 ఐజి చంద్రశేఖర్ రెడ్డి కితాబు

సిద్దిపేట, ముద్ర ప్రతినిధి: సిద్దిపేట సాయుధ దళాల వార్షిక పునరుచ్చరణ డి మొబిలైజేషన్, &స్పోర్ట్స్ మీట్స్  ముగింపు కార్యక్రమం సోమవారం పోలీస్ కన్వెన్షన్ సెంటర్లో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా  మల్టీజోన్-1 ఇన్స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (ఐ జి) ఎస్.చంద్రశేఖర్ రెడ్డి హాజరయ్యారు.   వార్షిక పునరుచ్చరణ డి మొబిలైజేషన్, &స్పోర్ట్స్ మీట్స్ లో ప్రతిభ కనబరిచిన అధికారులకు, సిబ్బందికి  మేమంటోస్, మెడల్స్, చిరు కానుకలను సిద్దిపేట పోలీస్ కమిషనర్ ఎన్.శ్వేతా రెడ్డి తో కలసి అందజేశారు.ఈ సందర్భంగా చంద్రశేఖర్ రెడ్డి మాట్లాడుతూ సిద్దిపేట పోలీసుల పనితీరు అమోఘం,  అభినందనీయమన్నారు. విధి నిర్వహణలో ఎల్లప్పుడూ అప్రమత్తంగా ఉంటూ ఎలాంటి సమస్య వచ్చినా సునాయాసంగా  చేదించడం  సిద్దిపేట పోలీసుల ప్రత్యేకతని తెలిపారు.

ప్రతి సంవత్సరం డి మొబిలైజేషన్ స్పోర్ట్స్ నిర్వహించుకొని ఆరోగ్య పరిరక్షణకు పాటుపడడం ముఖ్యమన్నారు. ఆరోగ్యమే మహాభాగ్యం ప్రతి ఒక్కరూ ఆరోగ్య పరిరక్షణ గురించి స్పోర్ట్స్, రన్నింగ్, యోగ,  చేస్తూ ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని మనం ఆరోగ్యంగా ఉంటే విధి నిర్వహణ, కుటుంబ బాధ్యతలు  సంతృప్తికరంగా నిర్వహించగలుగుతామని  సూచించారు.  స్పోర్ట్స్ అంటే నాకు కూడా చాలా ఇష్టమని తెలిపారు. ఆరోగ్య పరిరక్షణ గురించి ప్రతి మూడు నెలలకు ఒకసారి  మెడికల్ టెస్ట్ లు చేయించుకోవాలని తెలిపారు. పోలీస్ డిపార్ట్మెంట్లో జాయిన్ అయినప్పుడు  ఎంత బరువు ఉంటామో రిటైర్డ్ అయ్యేటప్పుడు కూడా అంతే బరువు ఉండాలని సూచించారు. మిత ఆహారం తీసుకోవాలని సూచించారు. నేను ప్రతిరోజు టెన్నిస్ ఆడతానని తెలిపారు, పోలీస్ డిపార్ట్మెంట్లో ఫిట్నెస్ చాలా ముఖ్యమన్నారు,  డబ్బులు ఉంటే దాచుకోవాలి శరీరంలో క్యాలరీస్ ఉంటే  వెంటనే ఖర్చు చేయాలని చెప్పారు. విధినిర్వహణ ఎంత ముఖ్యమో ఆరోగ్యం కూడా అంతే ముఖ్యం కుటుంబం కూడా చాలా ముఖ్యమని తెలిపారు. విధి నిర్వహణ కుటుంబ సభ్యుల బాధ్యతను సమానంగా చూసుకోవాలని తెలిపారు.

ఆరోగ్యంగా  క్రమశిక్షణగా ఉండడానికి  ముఖ్యపాత్ర వహిస్తాయని తెలిపారు.  టీమ్ స్పిరిట్స్ తో  ఏదైనా సాధించవచ్చని తెలిపారు.  ప్రతి మనిషిలో ఒత్తిడి ఉంటుందని తగ్గించుకోవడానికి గేమ్స్ స్పోర్ట్స్ యోగా రన్నింగ్ వాకింగ్ ప్రతిరోజు చేయాలని సూచించారు. విధి నిర్వహణ ఎంత ముఖ్యమో ఆరోగ్యాన్ని కాపాడుకోవడం కూడా అంతే ముఖ్యమని తెలిపారు, జిల్లా పోలీసులు అందరూ ఒక టిమ్ యూనిట్ గా విధులు నిర్వహించినప్పుడు ఏదైనా సాధించవచ్చని తెలిపారు, లా అండ్ ఆర్డర్ పోలీసులతో సమానంగా ఏఆర్ పోలీస్ అధికారులు సిబ్బంది విధులు నిర్వహించడం జరుగుతుందన్నారు. ఏఆర్ సిబ్బంది నైపుణ్యాలను మెరుగుపర్చేందుకు, వారిని కొత్త సవాళ్లను స్వీకరించేందుకు సమాయత్తం చేసేందుకు ప్రతి సంవత్సరం డి-మొబిలైజేషన్ భాగంగా శిక్షణ ఫైరింగ్ ప్రాక్టీస్ విధి నిర్వహణలో భాగంగా దోహదపడుతుందన్నారు. డి- మొబిలైజేషన్లో స్పోర్ట్స్ మీట్స్ లో ఉత్తమ ప్రతిభ కనపరిచిన పోలీస్ అధికారులకు సిబ్బందికి ఐజి చంద్రశేఖర్ రెడ్డి, పోలీస్ కమిషనర్ శ్వేత,కలసి ప్రైజ్  డిస్ట్రిబ్యూషన్ లో భాగంగా మెమొంటోస్, కప్స్,

అప్రిసియేషన్  సర్టిఫికెట్లు చిరు కానుకలు అందజేశారు.
ఈ కార్యక్రమంలో అడిషనల్ డీసీపీ అడ్మిన్ ఎస్, మహేందర్, ఏఆర్ అడిషనల్ డిసిపిలు రామ్ చందర్ రావు, సుభాష్ చంద్రబోస్, సిద్దిపేట ఏసీపీ దేవారెడ్డి, గజ్వేల్ ఏసిపి రమేష్, ఎస్బి ఏసిపి రవీందర్ రాజు, సిసిఆర్బి ఏసిపి చంద్రశేఖర్, ఎస్బి ఇన్స్పెక్టర్ రఘుపతి రెడ్డి, రిజర్వ్ ఇన్స్పెక్టర్లు శ్రీధర్ రెడ్డి, ధరణి కుమార్, రాజశేఖర్ రెడ్డి, రామకృష్ణ, ఇన్స్పెక్టర్లు, రవికుమార్, భాను ప్రకాష్, రూరల్ సీఐ జానకిరామ్ రెడ్డి, సీఐలు, ఎస్ఐలు, ఆర్ఎస్ఐలు,ఏఆర్ సివిల్ మహిళా సిబ్బంది  తదితరులు పాల్గొన్నారు.      

                              

అధికారుల ఫైరింగ్ విభాగంలో

1.మహేందర్, దుబ్బాక ఎస్ఐ మొదటి స్థానం,
2. యు.తిరుపతి, ఆర్ఎస్ఐ  రెండవ స్థానం

సివిల్ సిబ్బంది ఫైరింగ్  విభాగంలో

1. రవి, కానిస్టేబుల్ మొదటి స్థానం
2. కాశీనాథ్ గౌడ్,  హెడ్ కానిస్టేబుల్ రెండవ స్థానం

ఏఆర్ సిబ్బంది ఫైరింగ్ విభాగంలో

1. యాదగిరి, ఎఆర్ పిసి మొదటి స్థానం 
2. ఎం గణేష్, ఏఆర్ పిసి రెండవ స్థానం

5 కిలోమీటర్ల రన్నింగ్ విభాగంలో

1. రాజు, ఎఆర్ పిసి మొదటి స్థానం
2. సాయికుమార్, ఏఆర్ పిసి రెండవ స్థానం 

బ్యాట్మెంటన్ సింగిల్  అధికారుల విభాగంలో

1. రామ్ చందర్రావు, ఏఆర్ అడిషనల్ డీసీపీ ఫస్ట్ ప్రైజ్
2. రఘు, ఎస్బి ఇన్స్పెక్టర్ సెకండ్ ప్రైజ్

బ్యాట్మెంటన్ సింగిల్ సిబ్బంది విభాగంలో

1. జగన్, సిద్దిపేట రూరల్ కానిస్టేబుల్ ఫస్ట్ ప్రైజ్
2. ఆనంద్, సిద్దిపేట ట్రాఫిక్ కానిస్టేబుల్ సెకండ్ ప్రైజ్

బ్యాట్మెంటన్ డబుల్ సిబ్బంది విభాగంలో

1. రవి, సంతోష్, ఫస్ట్ ప్రైజ్
2. జానకిరామ్ రెడ్డి సిఐ సిద్దిపేట రూరల్, జగన్ కానిస్టేబుల్ సెకండ్ ప్రైజ్

బ్యాట్మెంటన్ సింగిల్స్ మహిళా  విభాగంలో

 1.శ్రీలత, అక్కన్నపేట పిఎస్ ఫస్ట్ ప్రైజ్.
2. మయూరి, సిఎఆర్ హెడ్ క్వార్టర్  సెకండ్ ప్రైజ్.

బ్యాట్మెంటన్ డబుల్స్  మహిళా సిబ్బంది విభాగంలో

1. చిత్ర, స్వప్న, ఫస్ట్ ప్రైజ్
2. శాంభవి, మౌనిక, సెకండ్ ప్రైజ్

టెన్నిస్ సింగిల్ మహిళా విభాగంలో

 1. జి శ్రీలత, అక్కన్నపేట ఫస్ట్ ప్రైజ్
2. చిత్ర, సివిల్ కానిస్టేబుల్ లో సెకండ్ ప్రైజ్

టెన్నిస్ డబుల్స్ మహిళా విభాగంలో 

 1. శాంభవి, ప్రశాంత్, ఏఆర్ పిసీలు ఫస్ట్ ప్రైజ్
2. చిత్ర, మౌనిక, సివిల్ కానిస్టేబుల్ లో సెకండ్ ప్రైజ్

వాలీబాల్  విభాగంలో

1. రామకృష్ణ, ఆర్ఐ అండ్ టీమ్ సిఆర్ హెడ్ క్వార్టర్ ఫస్ట్ ప్రైజ్
2. రవికుమార్, టూ టౌన్ ఇన్స్పెక్టర్ అండ్ టీమ్ సెకండ్ ప్రైజ్  

 క్రికెట్ విభాగంలో

1. శ్రీధర్ రెడ్డి, ఆర్ఐ అండ్ టీమ్ సిఏఆర్ హెడ్ క్వార్టర్  ఫస్ట్ ప్రైజ్.
2. జానకిరామ్ రెడ్డి, సిద్దిపేట రూరల్ సిఐ అండ్ టీమ్ సెకండ్ ప్రైజ్

టగ్గ ఫర్ ( తాడు) మహిళా విభాగంలో

1. జి స్వప్న, అండ్ టీమ్ ఫస్ట్ ప్రైజ్,
2. జె శ్యామల అండ్ టీమ్ సెకండ్ ప్రైజ్

టగ్గ ఫర్ ( తాడు) మెన్ విభాగంలో

1. రోహిత్, ఆర్ఎస్ఐ అండ్ టీమ్ సిఏఆర్ హెడ్ క్వార్టర్ ఫస్ట్ ప్రైజ్
2. బి చంద్రమోహన్, అండ్ టీమ్ చేర్యాల సర్కిల్ సెకండ్ ప్రైజ్ 

డి మొబిలైజేషన్లో ఏఆర్ సిబ్బందికి ఉత్తమ శిక్షణ ఇచ్చిన  అధికారులు సిబ్బంది

1. రవీందర్, ఏఆర్ ఎస్ఐ
2. యుద్ధవీర్, ఏఆర్ ఎస్ఐ
3. హనుమయ్య, ఏఆర్ హెడ్ కానిస్టేబుల్
4. శివ నాయక్, ఏఆర్ హెడ్ కానిస్టేబుల్