టీఎస్ఐసి ఇంటింటా ఇన్నోవేటర్ గోడ పత్రిక ఆవిష్కరణ 

టీఎస్ఐసి ఇంటింటా ఇన్నోవేటర్ గోడ పత్రిక ఆవిష్కరణ 

ముద్ర ప్రతినిధి:సిద్దిపేట:తెలంగాణ స్టేట్ ఇన్నోవేషన్ సెల్ (టీఎస్ఐసి),రాష్ట్ర ప్రభుత్వం,రాష్ట్రంలో ఆవిష్కరణలను, సృజనాత్మకతను ప్రోత్సహించడానికి ముఖ్యమైన కార్యక్రమాలు నిర్వహిస్తుంది.టీఎస్ఐసి నిర్వహించే ఇంటింటా ఇన్నోవేటర్ కార్యక్రమం 5వ విడత కార్యకలాపాలకు సంబందించి గోడ పత్రికను సిద్దిపేట జిల్లా కలెక్టర్ ప్రశాంత్ జే పాటిల్ చేతుల మీదుగా బుధవారం ఆవిష్కరించారు.  తెలంగాణ మొత్తం 33 జిల్లాల్లో ఇంటింటా ఇన్నోవేటర్ కార్యక్రమం ద్వారా గుర్తించిన ఆవిష్కరణలను స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల సందర్భంగా జిల్లా కలెక్టరేట్ నందు ప్రదర్శనకు ఉంచుతారు. 

ఆవిష్కరణ అంటే ఏమిటి

మీ చుట్టూ ఉండే సమస్యలకు పరిష్కారం కనుగొంటూ చేసే పరికరం ఏదయినా ఆవిష్కారం అవుతుంది.అన్ని రంగాల, వర్గాల నుండి వచ్చే ఆవిష్కరణలు ఈ ప్రదర్శనలో పెట్టి పాల్గొనవచ్చు.గ్రామీణ ఆవిష్కరణ, విద్యార్థుల ఆవిష్కరణ, ప్రారంభ ఆవిష్కరణలు, సూక్ష్మ చిన్న తరహా పరిశ్రమలలో ఆవిష్కరణలు మొదలైనవి కూడా అంగీకరించబడతాయని కలెక్టర్ తెలిపారు. ఆవిష్కరణలు పంపడానికి ఎటువంటి వయోపరిమితి,లింగ పరిమితి లేదని తెలిపారు.ఆవిష్కర్తలు తమ ఆవిష్కరణకు సంబంధించిన ఆరు వాక్యాలు,రెండు నిమిషాల వీడియోను, ఆవిష్కరణ యొక్క నాలుగు ఫోటోలు, ఆవిష్కర్త పేరు,ఫోన్ నెంబర్,వయస్సు, ప్రస్తుత వృత్తి, గ్రామం పేరు,జిల్లా పేరు వంటి వివరాలు 9100678543 కి వాట్సాప్ చేయాలనిఆయన సూచించారు. ఇన్నోవేటర్స్ నుండి దరఖాస్తులను స్వీకరించడానికి చివరి తేదీ ఆగష్టు 5 అని చెప్పారు.వచ్చిన దరఖాస్తుల నుండి మొదటి స్క్రూటినీ తరువాత,ప్రతీ జిల్లా నుంచి ఐదు ఆవిష్కరణలు ప్రదర్శనకు ఎంపికచేయ
బడుతాయి.గోడ పత్రిక ఆవిష్కరణ కార్యక్రమంలో ఈడిఎం ఆనంద్,జిల్లాకో ఆర్డినేటర్లు హర్షిత్, మనిధీప్ లు పాల్గొన్నారు.