పతాంజలి యువభారత్ సిద్దిపేట ఆధ్వర్యంలో ఘనంగా స్వామి వివేకానంద జయంతి

పతాంజలి యువభారత్ సిద్దిపేట ఆధ్వర్యంలో ఘనంగా స్వామి వివేకానంద జయంతి
Patanjali Yuva Bharat Siddipet

పతాంజలి యోగా సమితి సిద్దిపేట శాఖ ఆధ్వర్యంలో స్వామి వివేకానందుల వారి 160 జయంతి ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగా పతాంజలి యువభారత్ సిద్దిపేట జిల్లా అధ్యక్షులు సింగోజు మురళీకృష్ణ ఆచార్యుల ఆధ్వర్యంలో సిద్దిపేట జిల్లా సిద్దిపేట జిల్లా కేంద్రంలోని స్థానిక వివేకానంద సర్కిల్లో గల వివేకానంద స్వామి విగ్రహానికి పూలమాలవేసి స్వామి వివేకానంద ఆశయాలు వర్ధిల్లాలి అని నదించారు.

అనంతరం సింగోజు మురళీకృష్ణ ఆచార్యులు మాట్లాడుతూ స్వామి వివేకానందుల వారు ప్రపంచవ్యాప్తంగా ఉన్న వివిధ దేశాలలో గౌరవ మర్యాదలు పొందారని వారి సూక్తులను నేటికీ ఆదర్శంగా తీసుకొని జీవిస్తున్న వారు ప్రపంచ వ్యాప్తంగా ఉన్నారని  వారి అడుగుజాడల్లో నడిచి సమాజంలోని ప్రతి పౌరులు, రాజకీయ నాయకులు దేశం యొక్క ఔన్నత్యాన్ని పెంపొందించాలని పేర్కొన్నారు.భద్రతా పరంగా దేశం ప్రతిష్ట స్థితిలో ఉన్నప్పుడే దేశం అభివృద్ధి దిశగా మరింత ముందుకు వెళుతుందని సాధారణ పౌరులు, ప్రతి రాజకీయ నాయకులు దేశాన్ని పటిష్టమైన భద్రత స్థితిలో నిలిపి అభివృద్ధి దిశలో ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం ఉందని గుర్తు చేశారు.