నేడు సిద్దిపేటలో ఐటీ శాఖ మంత్రి కేటీఆర్, ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావుల పర్యటన

నేడు సిద్దిపేటలో ఐటీ శాఖ మంత్రి కేటీఆర్, ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావుల పర్యటన
  • పలు అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాలు శంకుస్థాపనలు చేయనున్న మంత్రులు
  • మంత్రులకు ఘన స్వాగతం ఏర్పాట్లు చేసిన సిద్దిపేట బిఆర్ఎస్ శ్రేణులు

ముద్ర ప్రతినిధి సిద్దిపేట: సిద్దిపేటలో గురువారం నాడు రాష్ట్ర మంత్రులు ఇద్దరు పర్యటించనున్నారు ఐటీ పురపాలక శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు ఆర్థిక వైద్య ఆరోగ్యశాఖ మంత్రి తన్నీరు హరీష్ రావులు సిద్దిపేట జిల్లాలో పర్యటించి పలు అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలకు శంకుస్థాపనలు ప్రారంభోత్సవాలు చేస్తారు అందుకు సంబంధించిన ఏర్పాట్లను సిద్దిపేట జిల్లా కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్ సిద్దిపేట పోలీస్ కమిషనర్ నేరేళ్లపల్లి శ్వేతారెడ్డి, సుడా చైర్మన్ మా రెడ్డి రవీందర్ రెడ్డి ఐటీ శాఖ అధికారులు, మున్సిపల్ చైర్మన్,మున్సిపల్ అధికారులు బుధవారం నాడు పర్యవేక్షించారు. తమ పార్టీ నేతలు ఇద్దరు సిద్దిపేటకు రాను ఉండడంతో భారత రాష్ట్ర సమితి శ్రేణులు వారికి ఘన స్వాగతం చెప్పడానికి విస్తృత ఏర్పాటు చేస్తున్నాయి. పలుచోట్ల ఫ్లెక్సీలను కటౌట్లను ఏర్పాటు చేసి సిద్దిపేటను గులాబీ రంగు కటౌట్లతో ఓరెత్తిస్తున్నా యి.

మంత్రుల పర్యటన వివరాలు ఇవే

రాష్ట్ర ఐటీ శాఖ పురపాలక శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు, ఆర్థిక వైద్య ఆరోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు గురువారం ఉదయం 10 గంటలకు సిద్ధిపేటకు చేరుకుంటారు. మంత్రి క్యాంపు కార్యాలయంలో కొద్దిసేపు ప్రముఖులను కలుస్తారు. అనంతరము సిద్దిపేట మండలం ఇరుకోడు వద్దku వెళ్లి అక్కడ ఆరు కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించిన స్లాటర్ హౌసును ప్రారంభిస్తారు. అనంతరము ప్రశాంత్ నగర్ లోని శ్రీ కోటిలింగేశ్వర స్వామి దేవాలయం వద్ద బిటి, సిసి రోడ్ల నిర్మాణ పనులకు శంకుస్థాపన చేస్తారు. సిద్దిపేటకు జలహారం పేరుతో మల్లన్న సాగర్ నుంచి సిద్దిపేటకు ఇటీవల వేసిన రింగ్ మెయిన్ పైపు లైన్ నుంచి నీటి సరఫరా పంపింగ్ను వారు ప్రారంభిస్తారు.

సిద్దిపేట అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ ద్వారా కప్పల కుంటలో నిర్మించనున్న కట్ట సుందరీకరణ పనులకు, అర్బన్ పార్కు నిర్మాణ పనులకు శంకుస్థాపనలు చేస్తారు. అనంతరం బురుజు వద్ద ఉన్న స్వచ్ఛ బడిలో సిద్దిపేటలో చేపట్టిన తడి పొడి చెత్తలకు సంబంధించి అమలు విధానాన్ని ప్రజెంటేషన్ ద్వారా చూస్తారు. దాని తర్వాత కొండపాక మండలం నాగుల బండ వద్ద రాజీవ్ రహదారిపై నూతనంగా 63 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించిన ఐటీ టవర్ ను ప్రారంభిస్తారు. ఈ సందర్భంగా అక్కడ ఏర్పాటుచేసిన బహిరంగ సభలో ప్రజానీకాన్ని నిర్దేశించి మంత్రులు ప్రసంగిస్తారు. ఈ సభకు దాదాపు పదివేల మంది ప్రజలను సమీకరిస్తున్నారు.