లక్షలాది మందిని పాటతో చైతన్యం తెచ్చిన గాయకుడు

లక్షలాది మందిని పాటతో చైతన్యం తెచ్చిన గాయకుడు
  • సిద్దిపేట లో మంత్రి క్యాంప్ కార్యాలయం లో సాయి చంద్ చిత్ర పటానికి నివాళ్ళు అర్పించిన నేతలు

ముద్ర ప్రతినిధి,సిద్దిపేట:-తెలంగాణ ఉద్యమ గాయకుడు,రాష్ట్ర గిడ్డంగుల సంస్థ చైర్మన్ సాయి చంద్ మరణం తమను తీవ్రంగా కలచి వేసిందని సిద్దిపేట మాజీ మున్సిపల్ చైర్మన్ రాజనర్సు, బీఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు కొండం సంపత్ రెడ్డిలు అన్నారు. తెలంగాణ ఉద్యమంలో సాయి చంద్ తన ఆటపాటతో ఉద్యమానికి ఊపిరి పోసాడని గుర్తు చేశారు. ఎంతోమంది ఉద్యమకారులు సాయిచంద్ పాటలకు ఆకర్షితులై ఉద్యమంలో పనిచేశారన్నారు.సిద్దిపేట జిల్లా కేంద్రంలోని మంత్రి హరీష్ రావు క్యాంపు కార్యాలయంలో గురువారం నాడు తెలంగాణ ఉద్యమ నాయకుడు,రాష్ట్ర గిడ్డంగుల సంస్థ చైర్మన్ సాయి చంద్ చిత్రపటానికి బీఆర్ఎస్ నాయకులు పూలమాలలు వేసి నివాళులర్పించారు.

అనంతరం రెండు నిమిషాల మౌనం పాటించి సాయిచంద్ ఆత్మ శాంతించాలని ప్రార్థించారు.ఈ సందర్భంగా మాజీ మున్సిపల్ చైర్మన్ కడవెరుగు రాజనర్సు, టిఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు సంపత్ రెడ్డి సహా పలువురు నాయకులు సాయిచంద్ తో తమకున్న అనుబంధాన్ని గుర్తుచేసుకొని కన్నీటి పర్యంతమయ్యారు.సాయిచంద్ మరణం తెలంగాణ రాష్ట్రానికి తీరని లోటు అన్నారు.ముఖ్యంగా సిద్దిపేట జిల్లాతో సాయి చంద్ కు విడదీయరాని బంధం ఉండేదని, సిద్దిపేటకు ఎప్పుడు వచ్చినా తమను ఆప్యాయంగా పలకరించే వాడని తెలిపారు.సాయి చందు భౌతికంగా మనకు దూరమైన తను పాడిన పాటల రూపంలో బతికే ఉంటాడని,ఆయన కుటుంబ సభ్యులకు ఆ భగవంతుడు మనోధైర్యం ఇవ్వాలని ప్రార్థించారు.ఈ కార్యక్రమంలో మునిసిపల్ వైస్ చైర్మన్ కనకరాజు, కౌన్సిలర్లు,బి ఆర్ ఎస్ నాయకులు పాల్గొన్నారు.