ఉద్యమ ప్రజా గాయకుడు సాయిచంద్ మరణం తీరని లోటు...

ఉద్యమ ప్రజా గాయకుడు సాయిచంద్ మరణం తీరని లోటు...

ముద్ర ప్రతినిధి, జగిత్యాల : తెలంగాణ ఉద్యమ కెరటం, ప్రజా గాయకుడు సాయిచందు మరణం తెలంగాణ కళా రంగానికి తీరని లోటని కళాశ్రీ అధినేత గుండేటి రాజు అన్నారు. తెలంగాణ ఉద్యమంలో తన పాటలతో ప్రజలను ఉత్తేజ పరచిన గొప్ప గాయకడని, నేడు తెలంగాణ ప్రభుత్వం లో గిడ్డంగుల శాఖ కార్పొరేషన్ చైర్మన్ గా కొనసాగుతున్న తరణములో ఇలా జరగడం యావత్తు తెలంగాణ ప్రజానీకాన్ని బాధలో ముచ్చెత్తిన సాయిచంద్ మన మధ్యలో భౌతికముగా లేకున్న పాట రూపం లో చిరంజీవిగా ఉంటాడని అన్నారు. కళాశ్రీ ఆర్ట్ థియేటర్స్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సంతాప సభలో రెండు నిమిషాలు మౌనం వహించి ఘన నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో గాన కోకిల ఎలిగేటి రాజేంద్రప్రసాద్, ఎలుగందుల రవి, బండారి వెంకటేశ్వర్లు, గొల్లపెల్లి శ్రీరాములు గౌడ్ కొమురవెళ్లి లక్ష్మీ నారాయణ, గాయకుడు అభి, బద్రి శ్రీరాములు తదితరులు పాల్గొన్నారు.