బిసిలఫై బిఆర్ ఎస్, కాంగ్రెస్ పార్టీలది దొంగ ప్రేమ 

బిసిలఫై బిఆర్ ఎస్, కాంగ్రెస్ పార్టీలది దొంగ ప్రేమ 
  • 50 ఏళ్ళ పాలనలో ఒక్క బిసిని ముఖ్యమంత్రిని చేయనిది కాంగ్రెస్
  • బిసిల పదవులను ఓసిలకు కట్టబెట్టింది బిఆర్ఎస్ 
  • బిజేపి రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు డా. బోగ శ్రావణి

ముద్ర ప్రతినిధి, జగిత్యాల: బిసిల పట్ల కాంగ్రెస్, బిఆర్ఎస్ పార్టీలది దొంగ ప్రేమ అని బిజేపి రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు డా. బోగ శ్రావణి విమర్శించారు. జగిత్యాల జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో శ్రావణి మాట్లాడుతూ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి, ఎమ్మెల్యే డా. సంజయ్ కుమార్ లను ఉద్దేశించి  50 ఏళ్ళ ఉమ్మడి రాష్ట్ర్ర  పాలనలో ఒక్క బిసిని ముఖ్యమంత్రిని చేయని వారు ఇప్పుడు బిసిల ఫై దొంగ ప్రేమను ఒలకబోస్తున్నావారు ఒకరు.. దళిత ముఖ్యమంత్రిని చేస్తానని మాట తప్పిన పార్టీ బిఆర్ ఎస్ ఆ పార్టీ ఎమ్మెల్యే బిసిల మీద దొంగ ప్రేమ ఒలక బోస్తు మాట్లాడుతున్నారని అన్నారు. 50 ఏళ్లలో బీసీలను ముఖ్యమంత్రి చేయని ఆ పార్టీ.. వారు అధికారం ఉన్నప్పుడు చిన్న స్థాయి నుంచి పెద్ద స్థాయి వరకు కూడా అగ్రకులాల వారికి పదవులు కట్టబెట్టిన నాయకులు బీసీలను ఎదగనీయని ఆ నాయకులు ఇప్పుడు బీసీల గురించి మాట్లాడుతున్నారు. ఎమ్మెల్యే బీసీలకు దక్కాల్సిన పదవులను ఇవ్వడంలేదని, ఎమ్మెల్యే ఎమ్మెల్సీకి బీసీల గురించి మాట్లాడే నైతిక అర్హత లేదన్నారు.

బిఆర్ఎస్ ఎమ్మెల్సీ ముదిరాజులను వర్ణించలేని విధంగా తిట్టినప్పుడు మీకు ముదిరాజులు గుర్తుకు రాలేదా అని, అంతకు ముందు మహిళలను కూడా తిట్టినప్పుడు ఎమ్మెల్యే  స్పందించలేదన్నారు. ముదిరాజులు, గంగ పుత్రులు  నిలదిక్కుకోవాలని కేంద్రం నిధులు ఇస్తే పేరు మార్చి డైవర్ట్ చేస్తున్నారన్నారు. బెల్ట్ షాపులు, కల్తిమద్యం అరికట్టాలని గీత కార్మికులు రోడ్డెక్కినప్పుడు ఎటుపోయారని ప్రశ్నించారు. విద్యా వ్యాపారాన్ని అరికట్టాలని, పాటశాలల్లో మౌలిక వసతులు కల్పించాలని, రాష్ట్రంలో మూత పడిన  8624 పాఠశాలలను  తెరిపించాలని ఎబివిపి కోరడం తప్ప అని ప్రశ్నించారు. పాఠశాలలో బాలికలకు వసతులు లేక ఇబ్బంది పడుతున్నారని, స్వీపర్ లేక విద్యార్థులే స్వీపర్గా మారారన్నారు. ప్రైవేట్ పాఠశాల నియంత్రణ కరువైందని, ఎన్ని గురుకులాలకు సొంత భవనాలు ఉన్నాయో చెప్పాలన్నారు. స్వార్థం కోసం రైతులను కులాల వారీగా విభజించవద్దని, రైతులను కూడా కులాల వారి విభజించింది ప్రపంచంలో మీరు ఒక్కరే అని అన్నారు. 

బీసీ బందులో గల్ఫ్ రిటర్న్స్ పరిస్థితి ఏంటని ఎమ్మెల్యే , ఎమ్మెల్సీ చెప్పాలన్నారు. రైతులకు రూ. 5000 రైతు బంధు ఇచ్చి 7500 తరుగు పేరుతో  తీసుకున్నారని అన్నారు. కేంద్రం ఎరువులుఫై సబ్సిడీ ఇస్తుందని, సీఎం కేసీఆర్ ఇస్తానన్న ఉచిత ఎరువులు ఏవని ప్రశ్నించారు. బీసీ బందుకు 15 రోజులు గడువిస్తే రెవెన్యూ కార్యాలయం చుట్టూ తిరగడానికి సమయం సరిపోలేదన్నారు.  రూరల్ ఎంపీపీ బీసీల కేటాయిస్తే ఓసిని కూర్చో పెట్టారని జగిత్యాల మున్సిపల్లో  బీసీ మహిళకు కేటాయిస్తే బిసి మహిళలు ఉన్న  ఓసిని కూర్చో బెట్టారు.. ఇదేనా మీరు బీసీలకు, మహిళలకు ఇస్తున్న గౌరవం అని ప్రశ్నించారు. జగిత్యాల మార్కెట్ కమిటీ ఓసికిస్తే వెంటనే భర్తీ చేశారని అదే రాయికల్లో ఎస్సీకిస్తే ఇంతవరకు భర్తీ చేయలేదన్నారు. వచ్చే ఎన్నికల్లో ఓటు అనే ఆయుధంతో ప్రజలు బుద్ధి చెప్తారు అన్నారు. ప్రజలు టిఆర్ఎస్ కాంగ్రెస్ లపై విసుకు చెందారని. ఈత వనాలు సక్సెస్ అయ్యాయా, నీర కేప్  అట్టర్ ప్లాప్ అని జగిత్యాల నుంచి ఎంత నీరు పంపారో  చెప్పాలన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జగిత్యాల్ రూరల్, సారంగాపూర్ మండల అధ్యక్షులు నలువాల తిరుపతి, ఎండబెట్ల వరుణ్ కుమార్, జగిత్యాల పట్టణ ఉపాధ్యక్షులు మడిశెట్టిమల్లేశం, బీజేవైఎం సారంగాపూర్ మండల అధ్యక్షులు దిటివెంకటేష్, పడాల తిరుపతి, ఎస్సీ మోర్చా అధ్యక్షులు నక్క జీవన్, జిల్లా కార్యవర్గ సభ్యులు గంగరాజాం, మహిళా మోర్చా జిల్లా ప్రధాన కార్యదర్శి సాంబారి,కళావతి, మల్లీశ్వరి తదితరులు పాల్గొన్నారు.