బలగం సినిమాకు మంత్రి కేటీఆర్ ఫిదా

బలగం సినిమాకు మంత్రి కేటీఆర్ ఫిదా
  • వేణు యెల్దండి ని పిలిపించుకొని సత్కరించారు..
  • బలగం సినిమా డైరెక్టర్ ను అభినందించిన మంత్రి కేటీఆర్
  • డైరెక్ట్ వేణు యెల్దండి కి కేటీఆర్ సత్కారం
  • ఇప్పుడే కమర్షియల్ చిత్రాల వైపు వెళ్ళకు మంత్రి కేటీఆర్ సూచన
  • బంధాలు, అనుబంధాలను గుర్తు చేసిన సినిమా బలగం
  • రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో మంత్రి కేటీఆర్

ముద్ర ప్రతినిధి, రాజన్న సిరిసిల్ల: తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలను అద్దం పట్టినట్లు చూపించిన బలగం సినిమా డైరెక్టర్ వేణు యెల్దండి ని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మంత్రి కేటీఆర్ అభినందించారు. బలగం సినిమా తాను చూసినట్లు ప్రకటించారు. వేణుని పిలిపించుకొని మరి సిరిసిల్ల కలెక్టరేట్ సముదాయంలో మంత్రి కేటీఆర్ సత్కరించారు. బలగం లాంటి సినిమాలు తక్కువ బడ్జెట్ తో సమాజానికి దోహదపడేలా సినిమాలు తీయాలని ఇప్పుడే కమర్షియల్ చిత్రాల వైపు వెళ్ళొద్దని మంత్రి కేటీఆర్ వేణుకు సూచించారు.

మంచి సినిమాలను ప్రజలు ఎప్పుడు ఆశీర్వదిస్తారని దీనికి ఉదాహరణ బలగం సినిమాని పేర్కొన్నారు. తాను గ్రాండ్ ఫ్రీ రిలీజ్ ఈవెంట్ కు హాజరైన సినిమా ఇంత స్థాయిలో విజయవంతం కావడం సంతోషంగా ఉందన్నారు. తరుణ్ నియోజకవర్గమైన సిరిసిల్లకు చెందిన వేణు సిరిసిల్ల ఖ్యాతిని బలగం సినిమాతో పెంచాలని ప్రశంసించారు. మంచి సినిమాలకు తన సపోర్ట్ ఎప్పుడూ ఉంటుందని, వేణు భవిష్యత్తులో మంచి స్థాయికి వెళ్లాలని కేటీఆర్ కోరారు. రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులు బోయిన్పల్లి వినోద్ కుమార్ తో పాటు ఎమ్మెల్యేలు సిహెచ్ రమేష్ బాబు, రసమయి బాలకిషన్, సుంకే రవిశంకర్, రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్ అనురాగ జయంతి, ఎస్పీ అఖిల్ మహాజన్, జడ్పీ చైర్పర్సన్ నేలకొండ అరుణ రాఘవరెడ్డి వేణు యెల్దండి కి అభినందనలు తెలిపారు.