ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో ఆధ్వర్యంలో రాజన్న సిరిసిల్ల జిల్లా జర్నలిస్టు లకు వర్క్ షాప్

ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో ఆధ్వర్యంలో రాజన్న సిరిసిల్ల జిల్లా జర్నలిస్టు లకు వర్క్ షాప్

ముద్ర సిరిసిల్ల టౌన్:-మీడియా రంగంలో వస్తున్న ఆధునిక మార్పులు, సామాజిక మాధ్యమాల వినియోగంతో పాటు సైబర్ సెక్యూరిటీ అంశాలపై భారత ప్రభుత్వ సమాచార ప్రసార మంత్రిత్వశాఖ లోని ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో (పిఐబి) హైదరాబాద్ వారు రాజన్న సిరిసిల్ల జిల్లా జర్నలిస్టులకు 'వార్తాలాప్' (మీడియా వర్క్ షాప్) నిర్వహించారు. సిరిసిల్లలో లహరి గ్రాండ్ ఫంక్షన్ హల్ లో  ఏర్పాటుచేసిన ఈ వర్క్‌షాప్ ను‌ జిల్లా అదనపు కలెక్టర్ ఖీమ్యనాయక్ ప్రారంభించారు. ఈ  సందర్భంగా ఖీమ్యనాయక్ మాట్లాడుతూ విలువలతో కూడిన జర్నలిజం కు ప్రతి ఒక్క జర్నలిస్ట్ కృషి చేయాలన్నారు. సీనియర్ జర్నలిస్టు డా. ఎస్. రాము ‘జర్నలిజంలో ఉత్తమ పద్ధతులు’ అనే అంశంపై వివరిస్తూ సరి అయిన ఆధారం లేని వార్తలు ఫార్వర్డ్ చేయవద్దని, ఎటువంటి ఒత్తిడి ఉన్న ఎవరికి భయపడకుండ నిజాలను ప్రజలకు చేరవేయడం లో జర్నలిస్ట్ లు ముందు ఉండాలని అన్నారు. సిరిసిల్ల వాస్తవ్యులు సిడాక్, హైదరాబాద్ ప్రాజెక్ట్ మేనేజర్ ఇటిక్యాల నరేష్  ‘సైబర్ సెక్యూరిటి, సైబర్ మోసాలపై అవగాహన కల్పించారు.ఈ కార్యక్రమంలో జిల్లా ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా జర్నలిస్టులు, ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో సిబ్బంది పాల్గొన్నారు