కేటీఆర్  కే మా మద్దతు...

కేటీఆర్  కే మా మద్దతు...
  • గోరింటాలలో యాదవ్ సంఘ సభ్యుల తీర్మానం..

ముద్ర, గంభీరావుపేట:-బీఆర్ఎస్ పార్టీకి, మంత్రి కేటీఆర్ కీ పలు కుల సంఘలు  మద్దతు ప్రకటించడంతో  కేటీఆర్ రోజురోజుకు ప్రజల్లో ఆదరణ పెరుగుతున్నది. గంభీరావుపేట మండలం గోరింటాల  గ్రామానికి చెందిన యాదవ కుటుంబాలు మంత్రి కేటీఆర్ కీ మద్దతు ప్రకటిస్తూ ఏకగ్రీవ తీర్మానం చేశారు. అనంతరం  జడ్పీటీసీ విజయ కీ తీర్మాన పత్రాన్ని అందజేశారు.ఈ కార్యక్రమంలో సర్పంచ్ అంజమ్మ బాలరెడ్డి, ఎంపిటీసి అంజిరెడ్డి , బీఆర్ఎస్ గ్రామ అధ్యక్షుడు బాషవేణి సురేందర్, ఉప సర్పంచ్ తిరుపతి రెడ్డి, యాదవ్ సంఘ సభ్యులు పాల్గొన్నారు.