కోదాడ నియోజకవర్గంలో బిఎస్పీని బలోపేతం చేస్తాం

కోదాడ నియోజకవర్గంలో బిఎస్పీని బలోపేతం చేస్తాం

ముద్ర , కోదాడ ప్రతినిధి: కోదాడ నియోజకవర్గంలో గ్రామ గ్రామాన బిఎస్పీ పార్టీని బలోపేతం చేసే దిశగా బహుజన సమాజ్ పార్టీ విస్తరిస్తుందని ఆ పార్టీ ఇంచార్జ్ పిల్లుట్ల శ్రీనివాస్ అన్నారు. అందులో భాగంగా నేడు నడిగూడెం మండలం చాకిరాల గ్రామం నుండి సామాజిక కార్యకర్త న్యాయ పరిరక్షణ సేవా సమితి మెంబర్ మాతంగి ఏసుబాబు , బహుజన సమాజ్ పార్టీ కోదాడ నియోజకవర్గ ఇంచార్జి పిల్లుట్ల శ్రీనివాస్ అధ్వర్యంలో పార్టీలో చేరారు . ఏసుబాబు పార్టీలో చేరడం, పార్టీకి ఎంతో బలమని, వారి అనుభవం పార్టీ అభివృద్ధికి దోహదపడుతుందని అన్నారు. ఈ సందర్బంగా ఏసుబాబు మాట్లాడుతూ పార్టీ బలోపేతానికి కృషి చేస్తానని RS ప్రవీణ్ కుమార్ గారి నాయకత్వానికి ఆకర్షితుడినై పిల్లుట్ల శ్రీనివాస్ నాయకత్వన్ని బలపరిచి పార్టీ బలోపేతానికి కృషి చేస్తానని అన్నారు.

ఈ కార్యక్రమంలో సూర్యాపేట జిల్లా బహుజన సమాజ్ పార్టీ కార్యదర్శి సాలే చంటి, కోదాడ నియోజకవర్గ జనరల్ సెక్రటరీ కాంపాటి శ్రావణ కుమార్, పట్టణ అధ్యక్షుడు షేక్ అజార్ బాబా, అనంతగిరి మండల అధ్యక్షుడు నూక గోపాల స్వామి, చిలుకూరు మండల అధ్యక్షుడు కొండా ఉపేందర్ గౌడ్, నియోజకవర్గ నాయకులు యరసానీ కృష్ణ, కాంపాటి వీరాస్వామి, వెంకటేష్, సాలె గురుస్వామీ తదితరులు పాల్గొన్నారు.