బసంత్ నగర్ టోల్ గేట్ సమీపన రోడ్డు ప్రమాదం సబర్డినేటర్ మహ్మద్ అబ్దుల్ ఖదీర్ మృతి

బసంత్ నగర్ టోల్ గేట్ సమీపన రోడ్డు ప్రమాదం సబర్డినేటర్ మహ్మద్ అబ్దుల్ ఖదీర్ మృతి

ముద్ర ప్రతినిధి,పెద్దపల్లి:- పెద్దపల్లి జిల్లాలోని రామగుండం సబ్ ట్రెజరీ కార్యాలయంలో సబర్డినేటర్ గా పని చేస్తున్న మహ్మద్ అబ్దుల్ ఖదీర్ (54) గురువారం ఉదయం బసంత్ నగర్ టోల్ గేట్ సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో దుర్మరణం చెందాడు. విధి నిర్వహణలో భాగంగా రామగుండం  కార్యాలయం వెళ్తున్న సమయంలో టోల్ గేట్ సమీపంలో ఆగి ఉన్న లారీని ఢీకొనగా వెనుక నుండి వచ్చిన మరో లారీ ఢీకొనడంతో తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు ఇచ్చిన సమాచారం మేరకు బసంత్ నగర్ పోలీసులు 108 లో పెద్దపల్లి ప్రభుత్వాస్పత్రికి తరలించారు. అప్పటికే  మృతి చెందినట్లు వైద్యులు దృవీకరించారు. ఈ సంఘటనపై బసంత్ నగర్ పోలీసులు విచారణ చేపట్టారు.