బీసీలకు న్యాయం చేయకపోతే రెబల్గా పోటీ - తండు శ్రీనివాస్ యాదవ్

బీసీలకు న్యాయం చేయకపోతే రెబల్గా పోటీ - తండు శ్రీనివాస్ యాదవ్

ముద్ర ప్రతినిధి సూర్యాపేట: కాంగ్రెస్ పార్టీ బీసీలకు న్యాయం చేయకపోతే జిల్లాలో హుజూర్నగర్, కోదాడ నియోజకవర్గాలలో కాంగ్రెస్ పార్టీ రెబల్ గా పోటీ చేయడానికి సంసిద్ధంగా ఉన్నానని రాష్ట్ర కాంగ్రెస్ ఓబీసీ సీనియర్ వైస్ చైర్మన్ తండు శ్రీనివాస్ యాదవ్ అన్నారు. మాజీ ప్రధాని ఇందిరాగాంధీ వర్ధంతి సందర్భంగా మంగళవారం ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో రోగులకు పళ్ళు బ్రెడ్లు పంపిణీ చేసి మాట్లాడారు. మొదటినుంచి కూడా బీసీలు కాంగ్రెస్ పార్టీకి పెద్ద ఓటు బ్యాంకు గా ఉన్నారని బీసీలను విస్మరించడం కాంగ్రెస్ పార్టీకి తగదన్నారు. మిగతా పార్టీలు బీసీలకు తగిన సంఖ్యలో సీట్లు ఇస్తున్నాయని, అలాంటప్పుడు కాంగ్రెస్ పార్టీ ఎందుకు టికెట్ల విషయంలో బీసీలకు అన్యాయం చేయాలని చూస్తుందని ప్రశ్నించారు. ఈ విషయంలో కాంగ్రెస్ పార్టీ అధిష్టానం మరోసారి పునరాలోచించి బీసీలకు టికెట్లు ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కాంగ్రెస్ ఓబీసీ సీనియర్ కోఆర్డినేటర్ బెంజ్జారపు రమేష్ గౌడ్, ఓబిసి జిల్లా ఉపాధ్యక్షులు గుంటి సైదులు నాయకులు పేర్ల గిరి యాదవ్, సిద్దు పరశురాం యాదవ్, రమేష్ యాదవ్, గుద్దేటి శ్యామ్, మాలబంటి, మట్టపల్లి శంబయ్య  తదితరులు పాల్గొన్నారు.