గోదావరిఖనిలో రెండు వేల నోటు కలకలం..

గోదావరిఖనిలో రెండు వేల నోటు కలకలం..

రామగుండంలో చందాల చందర్ అంటూ 2000 వేల నోటు పై ముద్రణ చేసి వేరసిన నోటు

ముద్ర ప్రతినిధి పెద్దపల్లి: రామగుండంలో 2000 నోటు కళకళం రేపింది... చందాల చందర్ అంటూ 2000 వేల నోటు పై ముద్రణ చేసి వేరసిన నోటు మంగళవారం తెల్లవారుజామున అందర్నీ ఆశ్చర్యపరిచింది. రామగుడం బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి కోరుకంటి చందర్ పేరిట చందాల చందర్ అంటూ... ఓ నోటు వెలువడటం రామగుండంతో పాటు జిల్లాలో సంచలనం రేకెత్తిస్తుంది. మంగళవారం తెల్లవారుజామున గుర్తు తెలియని వ్యక్తులు గోదావరిఖని జవహర్ నగర్ స్టేడియం లో  2000 వేల నోటుల ముద్రణ చేసిన నోట్లు ప్రత్యక్షమయ్యాయి. దీంతో ఎప్పటిలాగే ఉదయం మార్నింగ్ వాకింగ్ కు వచ్చిన స్థానికులు ఈ నోట్ల ను చూసి ఒక్కసారిగా అవాక్కయ్యారు. ఎమ్మెల్యే అభ్యర్థి కోరు కంటి చందర్ ఒక చిత్రంతో... ఆర్ ఎఫ్ సి ఎల్* స్కాం  బొగ్గు స్కాం ఎన్టిపిసి బూడిద స్కాం ఇసుక స్కామ్* ల పేరుతో ఈ నోటు వెలువడటం ఖనిలో కలకలం సృష్టించింది.