ఖమ్మంపల్లి లో ప్రధాన రహదారి పై ప్రమాదకరంగా వే బ్రిడ్జి కాంట...

ఖమ్మంపల్లి లో ప్రధాన రహదారి పై ప్రమాదకరంగా వే బ్రిడ్జి కాంట...
  • పట్టించుకోని టీఎస్ ఎండిసీ అధికారులు 
  • తీవ్ర ఇబ్బందులు పడనున్న  ప్రయాణికులు

ముత్తారం ముద్ర:  మండలంలోని  ఖమ్మంపల్లి-మంథని ప్రధాన రహదారి పై ప్రమాదకరంగా ఎకంగా ఇసుక వే బ్రిడ్జి కాంట ను గొందరు గుత్తేదారులు అక్రమంగా ఏర్పాటు చేస్తున్నారు. ఆయనప్పటికి టీఎస్ ఎండిసీ అధికారులు తమకు సంబంధం లేనట్టు చూసి చూడనట్టు వ్యవహరిస్తున్నారని ప్రజలు ఆగ్రహం  వ్యక్తం చేస్తున్నారు.  పర్మిషన్ లేకుండా దర్జాగా పట్టపగలే ప్రధాన రహదారిపై ప్రైవేటు భూమి ని లీజ్ కు తీసుకుని, అక్కడే కాంట ఏర్పాటు చేయడంతో ఈ ప్రధాన రహదారిపై మంథని  నుంచి ధర్మారం, బిట్టుపల్లి,  సీతంపేట, ఖమ్మంపల్లి, తాడిచర్ల, మల్లారం, పెద్దతూండ్ల మరియు భూపాలపల్లి కి ప్రయాణించే ప్రయాణికులకు ఇసుక లారీలను ప్రధాన రహదారిపై నిలిపి వేస్తే ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడనున్నారు. 

ఇసుక క్వారీల దగ్గర ఇసుక లారీలను కాంట వేసుకోవడం కోసం ఇసుకను లోడింగ్ చేసినా చోటనే వేబ్రిడ్జ్ కాంటా టీఎస్ఎండీసీ అధికారులు అక్కడనే ఏర్పాటు చేయాలి, కానీ ప్రభుత్వ నిబంధనలకు విరుద్దంగా కాంటను గుత్తే  దారులు తన ఇష్టం ఉన్న కాడ నిర్మిస్తున్నాప్పటికి,  అధికారులు  పట్టించుకోకపోవడం అనుమానాలకు దారి తీస్తుందని,  ఖమ్మంపల్లి గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అర్ అండ్ బీ రహదారి ప్రక్కనే ఇష్టానుసారంగా వేబ్రిడ్జ్ కంటను  నిర్మాణం చేస్తున్నారని,  దీంతో అ కాంట తో రహదారి పై వెళ్లే వాహనదారులకు మరియు ప్రజలకు తీవ్ర ఇబ్బందులు ఏర్పడుతయని, గత రెండు ఏండ్లుగా రహదారిపై ఇసుక లారీలను నిలుపుదల చేస్తున్నారని, రహదారిపై లారీలను పార్కింగ్ లు పెట్టి వాహన దారులను తీవ్ర ఇబ్బందులు పెడుతున్నారని, ఇప్పటికీ లారీలతో ఇద్దరు మృతి చెందగా, పలువురికి తీవ్రంగాయాలు అయ్యాయని,  మూగజీవాలు కూడా ఎన్నో మృతి చెందాయని,  సంబంధింత  అధికారులు ఎక్కడ పడితే అక్కడ వేబ్రిడ్జ్ లకు అనుమతులు ఇవ్వకుండా నిలుపుదల చెయ్యాలని, ప్రజలు ఇబ్బందులు పడకుండా ప్రజా ప్రతినిధులు కూడా చూడాలని ఖమ్మంపల్లి ప్రజలు జిల్లా కలెక్టర్ ను కోరుతున్నారు. లేకుంటే త్వరలోనే ఇసుక లారీలతో ఇబ్బందులు  పడుతున్న ప్రజలు రైతులు ఆందోళన చేయడానికి సిద్ధమవుతున్నారు.