శ్రీ రామా సినిమా

శ్రీ రామా సినిమా

థియేటర్ ను ఎమ్మెల్యే విజయరమణారావుతో కలిసి ప్రారంభించిన మంత్రి దుద్దిళ్ళ శ్రీధర్ బాబు 

ముద్ర ప్రతినిధి పెద్దపల్లి: సుల్తానాబాద్ పట్టణంలోని నూతనంగా నిర్మించిన "శ్రీరామా సినిమాస్" థియేటర్ ను సోమవారం తెలంగాణ రాష్ట్ర పరిశ్రమలు, ఐటీ మరియు శాసనసభ వ్యవహారాల శాఖల మంత్రి దుద్దిళ్ళ శ్రీధర్ బాబు పెద్దపల్లి శాసనసభ్యులు చింతకుంట విజయరమణ రావు తో కలిసి థియేటర్ ను ప్రారంభించారు.

ఈ సందర్భంగా శ్రీధర్ బాబు మాట్లాడుతూ సుల్తానాబాద్ మండలం ప్రజల కు మానసిక ఉల్లాసం కోసం సినిమా థియేటర్లు ఎంతో ఉపయోగపడతాయని, సుల్తానాబాద్ మండల కేంద్రంలో సినిమా థియేటర్ ను నిర్మించిన యాజమాని ముసుగుల సయేందర్ రెడ్డి తో పాటు ఆయన టీం ను ప్రశంసించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు మరియు తదితరులు పాల్గొన్నారు.