చైతన్య విద్యానికేతన్ లో ఆకట్టుకున్న సైన్స్ వేర్

చైతన్య విద్యానికేతన్ లో ఆకట్టుకున్న సైన్స్ వేర్

ముద్ర  కూకట్‌పల్లి,ప్రతినిధి :  చైతన్య విద్యా నికేతన్ లెనిన్ నగర్ లో సైన్స్ వేర్ నిర్వహించడం జరిగింది.దీనికి ముఖ్య అతిథులుగా శ్రీనివాస్ నగర్ బస్తీ దవాఖానా మెడికల్ ఆఫీసర్ డాక్టర్ శివరాత్రి శ్రృతి విద్య ప్రారంభించారు .వారు మాట్లాడుతూ పిల్లలలో దాగివున్నటువంటి నైపుణ్యాన్ని సైన్స్ ఎక్స్ బిట్స్ ద్వారా వారు ప్రదర్శించారు.

రాబోయే యువతరానికి నేటి బాలలే రేపటి పౌరులు అని వారు ప్రదర్శించిన ఎక్స్ బిట్స్ అన్ని కూడా చాలా బాగా తల్లిదండ్రులను ఆకట్టుకున్నాయి.ముఖ్యంగా చంద్రయాన్, డయాలసిస్,రెయిన్ వాటర్ హర్ వెస్టింగ్ మొదలగు ఎక్స్ బిట్స్ లతో తల్లిదండ్రులను ఆకర్షించాయి.దీనికి ప్రత్యేక ఆహ్వానులుగా మేడ్చల్ జిల్లా ట్రస్మా అధ్యక్షులు మరియు తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ మరియు చైతన్య విద్యా నికేతన్ సంస్థల కరస్పాండెంట్ శ్రీ శివరాత్రి యాదగిరి గారు పాల్గొన్నారు.