గుండె పోటుతో వివాహిత మృతి

గుండె పోటుతో వివాహిత మృతి

పరామర్శించిన మాజీ ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్ రెడ్డి

ముద్ర,పానుగల్ : పానుగల్ మండలంలోని రేమొద్దుల గ్రామానికి చెందిన హర్షన్న యువసేన నియోజకవర్గ అధ్యక్షుడు రంగాపురం శివారెడ్డి సతీమణి రంగాపురం స్వప్న(35) గురువారం గుండె పోటుతో మృతి చెందింది.మృతురాలి కుటుంబ సభ్యులను కొల్లాపూర్ మాజీ ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్ రెడ్డి పరామర్శించారు. మృతదేహంపై పుష్పగుచ్చాన్ని ఉంచి నివాళులర్పించారు.. పరామర్శించిన వారిలో ఎంపిపి మామిళ్ళపల్లి శ్రీధర్ రెడ్డి, బిఆర్ఎస్ పార్టీ నాయకులు వెంకటయ్య నాయుడు వీర సాగర్,విండో డైరెక్టర్ జైపాల్ రెడ్డి,మాజీ మార్కెట్ కమిటీ డైరెక్టర్ దామోదర్ రెడ్డి,మాజీ సర్పంచ్ యాదగిరిచారి,ప్రసాద్ రెడ్డి,రవీందర్ రెడ్డి,మల్లేష్ యాదవ్,రామకృష్ణ,నవీన్ రెడ్డి,తదితరులు ఉన్నారు