ఇచ్చిన అప్పుతిరిగి ఇప్పించండి మహాప్రభో....

ఇచ్చిన అప్పుతిరిగి ఇప్పించండి మహాప్రభో....
  • ఖని ప్రధాన చౌరస్తాలో మహిళ బైఠాయింపు...
  • హ్యూమన్ రైట్స్, మహిళా సంఘాల ఆధ్వర్యంలో దీక్ష..


ముద్ర ప్రతినిధి పెద్దపల్లి:- తాను ఇచ్చిన అప్పు తిరిగి ఇవ్వకపోగా, అడిగితే బెదిరింపులకు పాల్పడుతున్నాడని, న్యాయం కోసం పోలీస్ స్టేషన్ కు వెళ్లినా న్యాయం జరగడం లేదంటూ.. గోదావరిఖని అడ్డగుంటపల్లికి చెందిన తీగల మళ్లీశ్వరి అనే మహిళ తన గోడు వెల్లబోసుకుంది. గోదావరిఖని ప్రధాన చౌరస్తాలో బైఠాయించింది.  ఆ మహిళ కు న్యాయం చేయాలంటూ.. హ్యూమన్ రైట్స్ అసోసియేషన్ ప్రతినిధి శిరిన్, కర్నాటి సీతక్క ఆధ్వర్యంలో మహిళా సంఘాలు మద్దతుగా కదిలి వచ్చి దీక్ష చేపట్టారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. స్థానిక అడ్డగుంట పల్లికి చెందిన తీగల మళ్ళీశ్వరి - రాజేశం దంపతులు గత మూడేళ్ల క్రితం అదే కాలని కి చెందిన శ్రావణ్ గౌడ్ అనే వ్యక్తికి రూ.7 లక్షలు అప్పు ఇచ్చినట్లు తెలిపారు. తీసుకున్న అప్పుకు వడ్డీ కూడా ఇవ్వకపోగా కనీసం అసలు అయినా చెల్లించాలని అడిగితె బాధిత మహిళను భయభ్రాంతులకు గురి చేస్తున్నాడని వాపోయాడు. ఇచ్చిన అప్పు డబ్బులు తిరిగి ఇవ్వకపోవడంతో సదురు మహిళ కుటుంబం తీవ్ర మానసిక ఇబ్బందులకు గురవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.  ఈ విషయంలో పోలీసు ఉన్నతాధికారులు జోక్యం చేసుకోని బాధిత మహిళకు న్యాయం చేసేంతవరకు విరమించేది లేదని భీష్మించుకుని కూర్చున్నారు. కాగా సంఘటన విషయం తెలుసుకున్న స్థానిక ఎమ్మెల్యే మక్కాన్సింగ్ రాజ్ ఠాకూర్ న్యాయం జరిగేలా చర్యలు తీసుకుంటానని ఆమె ఇచ్చినట్లు తెలిపారు. ఈ దీక్షలో పలువురు మహిళా సంఘం సభ్యురాలు పాల్గొన్నారు.