వినియోగంలోకి తెచ్చేదేన్నడో..?

వినియోగంలోకి తెచ్చేదేన్నడో..?
  • పనులు అసంపూర్ణం..మరుగుదొడ్లు నిరుపయోగం

భూదాన్ పోచంపల్లి,ముద్ర:-భూదాన్ పోచంపల్లి పురపాలక కేంద్రంలోని ప్రజలతో పాటు ఆయా గ్రామాల నుంచి వచ్చే సౌకర్యార్థం కోసం తహాసిల్దార్ కార్యాలయం పక్కన రెండేళ్ల కిందట లక్షల రూపాయలు వేచించి అధికారులు మరుగుదొడ్డిని నిర్మించారు. అప్పట్లో దానిని హడావుడిగా ప్రారంభించారు. కానీ ఆ తరువాత ఆ మరుగుదొడ్డిని వినియోగంలోకి మాత్రం తీసుకురాలేదు. దీంతో ఆ మరుగుదొడ్డి రెండేళ్లుగా నిరుపయోగంగానే ఉండిపోయింది. రెండేళ్ల క్రితం నిర్మించిన ఈ మరుగుదొడ్డికి డ్రైనేజీ సరఫరా లేదు. తక్షణమే సంబంధిత అధికారులు స్పందించి ఈ మరుగుదొడ్డిని వినియోగంలోకి తీసుకురావాలని పట్టణ ప్రజల కోరుతున్నారు.