ఆసుపత్రి లో రాత్రి వేళలో పూర్తి స్థాయిలో వైద్య సేవలు అందుబాటులో ఉంచాలి

ఆసుపత్రి లో రాత్రి వేళలో పూర్తి స్థాయిలో వైద్య సేవలు అందుబాటులో ఉంచాలి

ముద్ర ప్రతినిధి భువనగిరి :భువనగిరి జిల్లా కేంద్రం లోని ప్రభుత్వ ఆసుపత్రి లో రాత్రి సమయం లో వైద్య సేవలు పూర్తి స్థాయిలో అందుబాటులో ఉండాలని వై ఎస్ ఆర్ తెలంగాణ పార్టీ జిల్లా అధ్యక్షులు మహమ్మద్ అతహర్ జిల్లా అదనపు కలెక్టర్ వీరారెడ్డి కి సోమవారం వినతిపత్రం అందచేశారు. ఈ సందర్బంగా అతహర్ మాట్లాడుతూ భువనగిరి జిల్లా కేంద్రం అయినప్పట్టికి రాత్రి సమయం లో వైద్య సేవలు పూర్తి స్థాయిలో అందుబాటులో లేకపోవడం వలన ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురైతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. గత వారం ఒక చిన్న పాప ఆరోగ్యం క్షినించి రాత్రి సమయం లో ఏరియా ఆసుపత్రి కి వస్తే ఎవరు లేరు హైదరాబాద్ తీసుకువెళ్లమని ఆక్సిజన్ పెట్టి పంపించడం దారుణమని దారిలో పాపకు ఏదైనా జరిగితే ఎవరు బాధ్యులని ప్రశ్నించారు ? అదే కాకుండా 3 రోజుల క్రితం ఒక యువకుడు అనారోగ్యం తో రాత్రి 10.30 గంటలకు ఏరియా ఆసుపత్రి కి వెళితే ఎవరు లేరు అని చెప్పడం ఏంటని?అంటే మరి ప్రభుత్వ ఆసుపత్రి ఉండి ఎం లాభం అని ఆగ్రహం వ్యక్తం చేశారు . రాత్రి సమయం లో కూడా భువనగిరి ప్రభుత్వ ఏరియా ఆసుపత్రి లో పూర్తి స్థాయిలో వైద్యం అందే విధంగా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమం నాయకులు సాయి నివాస్, వాహేద్, వసీమ్ పాల్గొన్నారు.