రామచంద్రయ్య మరణం ప్రజా ఉద్యమాలకు తీరని లోటు....

రామచంద్రయ్య మరణం ప్రజా ఉద్యమాలకు తీరని లోటు....

  • సిటీ ఐఎంఎల్ న్యూడెమోక్రసీ జిల్లా కార్యదర్శి బిక్షపతి వెల్లడి..

యాదగిరిగుట్ట (ముద్ర న్యూస్):అఖిలభారత రైతు కూలీ సంఘం తెలంగాణ రాష్ట్ర కోశాధికారి దేశెట్టి రామచంద్రయ్య ఆకస్మిక మరణం ప్రజా ఉద్యమాలకు తీరని లోటు అని సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ జిల్లా కార్యదర్శి మామిడాల బిక్షపతి అన్నారు. గురువారం నాడు యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్ట మండలంలోని బాహిపేట గ్రామంలో సిపీఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ గ్రామ శాఖ కార్యదర్శి మరియు గ్రామ పాల ఉత్పత్తి దారుల సహకార సంఘం అధ్యక్షులు భూషే శ్రీశైలం అధ్యక్షతన జరిగిన సంతాప సభకు ఆయన ముఖ్య అతిథిగా హాజరై రామచంద్రయ్య చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించి. నివాళులు అర్పించిన అనంతరం మాట్లాడుతూ రైతు కూలీ సంఘం రాష్ట్ర కోశాధికారిగా పనిచేస్తూనే నిరంతరం ప్రజా సమస్యల పరిష్కారం కోసం. అనేక ఉద్యమాలను నిర్మించి. పోరాడిన గొప్ప పోరాట యోధులు అని కొనియాడారు. రామచంద్రయ్య అనారోగ్యంతో మరణించడం పేద ప్రజలకు తీరని లోటు అని ఆవేదన వ్యక్తం చేశారు. రామచంద్రయ్య తన యావత్ జీవితం ప్రజా ఉద్యమాలకు అంకితం చేస్తూ హక్కుల కోసం జరిగే అనేక పోరాటాలలో ముందుండి పోరాడారని గుర్తు చేశారు. ఆయన ఆశయ సాధన కోసం కేంద్ర. రాష్ట్ర ప్రభుత్వాలు అవలంబిస్తున్న ప్రజా ఉద్యమాలను నిర్మించి. దోపిడి రహిత సమాజం కోసం కృషి చేసినప్పుడే అమరవీరులకు మనం అందించే నిజమైన నివాళులు అని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో డివిజన్ కార్యదర్శి ఇక్కిరి సహదేవ్. పివైఎల్ జిల్లా అధ్యక్షులు మారుజోడు సిద్దేశ్వర్. జిల్లా కార్యదర్శి ఎలగందుల సిద్దులు. ఐఎఫ్టియు జిల్లా సహాయ కార్యదర్శి పంజాల మురళి. ప్రజా సంఘాల నాయకులు బుడిగే లక్ష్మయ్య. పంజాల గోవర్ధన్. అంజయ్య. నరసింహులు తో పాటు తదితరులు పాల్గొన్నారు.