గీత కార్మికులకు కార్పొరేషన్ ద్వారా రుణాలు మంజూరు చేయాలి:పుట్ట రమేష్ గౌడ్

గీత కార్మికులకు కార్పొరేషన్ ద్వారా రుణాలు మంజూరు చేయాలి:పుట్ట రమేష్ గౌడ్

భువనగిరి ఆగస్టు 03  (ముద్ర న్యూస్):- యాదాద్రి భువనగిరి జిల్లా గీతపనివారల సంఘం పిలుపును అనుసరించి గురువారం భువనగిరి తహాసిల్దార్ కార్యాలయం ముందు నిరసన తెలియజేసి డిప్యూటీ తహసిల్దార్ మంజుల కి మెమోరాoడం ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో గీత పనివారల సంఘం జిల్లా కార్యవర్గ సభ్యులు పుట్ట రమేష్ గౌడ్ మాట్లాడుతూ, గీత కార్మికుల సమస్యల సాధన కోసం కీర్తిశేషులు ధర్మబిక్షం  నాయకత్వంలో కార్మికుల హక్కుల సాధన కోసం కృషి చేశారని గీత కార్మికుల సంఘాల కోసం పది ఎకరాలు ఈత తాటి చెట్ల పెంపకం కోసం కేటాయించాలని రమేష్ డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన కార్పొరేషన్ ద్వారా గీత కార్మికులకు  వెహికిల్స్ ఇవ్వాలని ఉన్నత చదువుల కోసం కుటుంబాలకు రుణాలు పెన్షన్  ఐదు వేలు నిరుపేదలకు స్థలాలు ఇండ్లు మంజూరు చేయాలని  కళ్ళునుశీతల పానీయంగా తయారు చేసి మార్కెట్లో పేట్టాలని డిమాండ్ చేశారు.నందనం గ్రామంలో గీతా కార్మికుల పరిశ్రమ పనులు వేగవంతం చేయాలని తక్షణమే పరిశ్రమను ప్రారంభించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారుఈ కార్యక్రమంలో బీసీ హక్కుల సాధన సమితి జిల్లా ప్రధాన కార్యదర్శి ఏషాల అశోక్ గీత పనివారాల సంఘం జిల్లా కమిటీ సభ్యులు మచ్చ చంద్రమౌళి గౌడ్ నాయకులు బొజ్జ వెంకటేశం గౌడ్, పుట్ట రాజేష్ గౌడ్ పుట్ట,చంటి గౌడ్,చింతల పెంటయ్య తదితరులు పాల్గొన్నారు.