జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు, హెల్త్ కార్డుల అమలుకై పోస్ట్ కార్డు ఉద్యమం

జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు, హెల్త్ కార్డుల అమలుకై పోస్ట్ కార్డు ఉద్యమం

మోత్కూర్ (ముద్ర న్యూస్): తెలంగాణ ఉద్యమ సమయంలో జర్నలిస్టులు రాష్ట్ర సాధన కోసం అహర్నిశలు కృషి చేశారని, రాష్ట్ర ముఖ్యమంత్రి సీఎం కేసీఆర్ జర్నలిస్టులకు ఎన్నో హామీలను ఇచ్చారని తక్షణమే వాటిని అమలు చేయాలని టియుడబ్ల్యూజే ఐజేయు యాదాద్రి భువనగిరి జిల్లా మాజీ కార్యదర్శి ,అక్రిడేషన్ కమిటీ సభ్యులు వెలిమినేటి జహంగీర్ అన్నారు. శనివారం మున్సిపల్ కేంద్రంలోని అంబేద్కర్ చౌరస్తాలో జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు, హెల్త్ కార్డులను తక్షణమే అమలు చేయాలని కోరుతూ సీఎం కేసీఆర్ కు పోస్ట్ కార్డు ఉద్యమాన్ని ప్రారంభించారు. జర్నలిస్టులు ప్రజా సమస్యల పరిష్కారంలో ప్రభుత్వానికి ,ప్రజలకు వారధిగా ఉంటూ తమ వృత్తి ధర్మాన్ని నెరవేరుస్తున్నారని ,జర్నలిస్టుల హామీలన్నింటిని అమలయ్యేలా చర్యలు తీసుకోవాలని కోరారు.

అనంతరం పాత బస్టాండ్ లో పోస్ట్ బాక్స్ లో పోస్ట్ కార్డులను  ముఖ్యమంత్రికి పంపించారు.  టియుడబ్ల్యూజే ఐజేయు మోత్కూర్ మండల శాఖ అధ్యక్షుడు ధబ్బేటి సోంబాబు ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో యూనియన్ సీనియర్ సభ్యులు, సీనియర్ జర్నలిస్టులు కాగితాల నర్సిరెడ్డి, ఎస్ఎన్ చారి ,సభ్యులు ఎండి షాకీర్, మాశెట్టి వెంకన్న, ఆకవరం శ్రీనివాస్ చారి, చేపూరి అనిల్,గుండు ప్రసాద్ ,దబ్బేటి రమేష్, గంట శ్రీనివాస్ రెడ్డి, బిల్లపాటి మహేందర్ రెడ్డి, గోవర్ధన్ రెడ్డి ,సూరారం నర్సింహా, గాదెనబోయిన నాగరాజు ముషం శ్రీనివాస్, వారాల నరేష్,పోచం కన్నయ్య తదితరులు పాల్గొన్నారు.