రోడ్డు ప్రమాదంలో అంబులెన్స్ డ్రైవర్ మృతి

రోడ్డు ప్రమాదంలో అంబులెన్స్ డ్రైవర్ మృతి

మెట్‌పల్లి ముద్ర: కోరుట్ల పట్టణం డి-40 కెనాల్ వద్ద శుక్రవారం అర్ధరాత్రి ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదం లో కోరుట్ల పట్టణానికి చెందిన అంబులెన్స్ డ్రైవర్ ఇమ్రాన్ అనే యువకుడు మృతి చెందాడు. కోరుట్ల ఎస్సై కిరణ్ కుమార్ తెలిపిన వివరాల మేరకు కోరుట్ల పట్టణానికి చెందిన మోహసిన్, అబిద్, షారు, వాజిద్, అంబులెన్స్ డ్రైవర్ ఇమ్రాన్  ఐదుగురు మేడిపల్లి మండలం పోరుమాల్ల గ్రామానికి ఆటోలో వెళుతున్నారు. డి-40 కెనాల్  వద్ద ఆటో, లారీ ఢీకొన్నాయి. ఈ ఘటనలో ఆటోలో ప్రయణిస్తున్న మోహసిన్, అబిద్, షారు, వాజిద్, అంబులెన్స్ ఇమ్రాన్ లకు తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు కోరుట్ల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఇమ్రాన్ పరిస్థితి విషమంగా ఉండడంతో మెరుగైన వైద్యం కోసం కరీంనగర్ తరలించారు. చికిత్స పొందుతూ ఇమ్రాన్ మృతి చెందాడు. షారు, వాజిద్ జగిత్యాల ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఇమ్రాన్ కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు.