మహానంది పురస్కారం అందుకున్న దుంపెన రమేష్ 

మహానంది పురస్కారం అందుకున్న దుంపెన రమేష్ 

పర్యావరణ పరిరక్షణ, సాహిత్య, సామాజిక సేవా రంగంలో జాతీయ పురస్కారంతో నారాయణపూర్ గ్రామంలో ఆనందం

ముద్ర, ఎల్లారెడ్డిపేట: రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం నారాయణపూర్ గ్రామానికి చెందిన దుంపెన రమేష్ దంపతులు ఆదివారం హైదరాబాద్ త్యాగరాయగాన సభలో ఉగాది మహానంది పురస్కారం అందుకున్నారు. పర్యావరణ, పరిరక్షణ, సామాజిక,సాహిత్య రంగాలలో తనదైన ముద్ర వేసుకున్నారు. అదేవిధంగా మొక్కల పెంపకం, మొక్కల పంపిణీ, సంరక్షణ పర్యావరణ, పరిరక్షణ కోసం ఎంతో కృషి చేశారు. రచయితగా సాహితీ రంగంలో చిగురు, గుమ్మడి పూలు తులసి పుస్తకాలను ఆవిష్కరించాడు.

తెలంగాణ రాష్ట్రంకు చెందిన తెలుగు వెలుగు సాహితీ వేదిక వారు ఉగాది ఉత్సవాలను పురస్కరించుకుని మహానంది జాతీయ పురస్కారాన్ని  అందజేశారు. తన స్వగ్రామమైన నారాయణపూర్, ఎల్లారెడ్డిపేటలో  పలువురు హర్షం వ్యక్తం చేశారు. ఈ పురస్కారం లభించడం పట్ల  జిల్లా బీఆర్ఎస్ అధ్యక్షులు తోట ఆగయ్య, గ్రామ శాఖ అధ్యక్షులు బండారి బాల్ రెడ్డి,  సింగిల్ విండో అధ్యక్షులు గుండారపు కృష్ణారెడ్డి, మాజీ ఎంపీపీ సుజాత మోహన్, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు దొమ్మాటి నర్సయ్య, డాక్టర్ జి సత్యనారాయణ స్వామి, యమగోండ బాల్ రెడ్డి, గంప నాగేంద్రం, దుబ్బ విశ్వనాథం, చందనం మురళి, వాసర వేణి పరుశరాములు తదితరులు అభినందించారు.