ఇద్దరిపై వీధి కుక్కల దాడి..

ఇద్దరిపై వీధి కుక్కల దాడి..

గాయాలు, ఆసుపత్రికి తరలింపు..
మెట్‌పల్లి ముద్ర: ఇద్దరి వ్యక్తులపై వీధి కుక్కలు దాడి చేసిన ఘటన ఇబ్రహీంపట్నం మండల పరిధిలోని అమ్మక్కపేట గ్రామంలో ఆదివారం చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. గ్రామానికి చెందిన లవంగ శంకర్ తో పాటు మరో మహిళ వీధిలో నడుస్తూ వెళుతుండగా ఒక్కసారిగా వీధి కుక్కలు దాడి చేయగా తీవ్ర గాయాలపాలయ్యారు. ఈ ఘటనలో ఇద్దరిని చెవి భాగంతో పాటు పలుచోట్ల కుక్కలు తీవ్రంగా గాయపరిచాయి.

గమనించిన స్థానికులు ఇరువురిని చికిత్స నిమిత్తం మెట్‌పల్లి పట్టణంలోని ప్రభుత్వాసుపత్రికి తరలించారు. శంకర్ చెవికి తీవ్రంగా గాయం కావడంతో వైద్యుల సూచనల మేరకు జగిత్యాల ఆసుపత్రికి తరలించినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. కాగా గ్రామంలో కుక్కల బెడద ఎక్కువగా ఉన్నదని కుక్కల బెడద నుండి విముక్తి కల్పించాలని ప్రజలు అధికారులను కోరుతున్నారు.