తెలంగాణలో అన్నివర్గాలకు పెద్దపిట- మండలి డిప్యుటీ చైర్మన్ బండ ప్రకాష్

తెలంగాణలో అన్నివర్గాలకు పెద్దపిట- మండలి డిప్యుటీ చైర్మన్ బండ ప్రకాష్

తూప్రాన్, ముద్ర: తెలంగాణ రాష్ట్రంలో కెసిఆర్ ప్రభుత్వం అన్ని వర్గాలకు పెద్దపిట వేస్తుందని శాసన మండలి డిప్యుటీ చైర్మన్ బండా ప్రకాష్ ముదిరాజ్ అన్నారు. గురువారం వెల్దుర్తి మండలం మానేపల్లి గ్రామంలో ముదిరాజ్ సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన పెద్దమ్మ తల్లి ప్రథమ వార్షికోత్సవ వేడుకలో జిల్లా పరిషత్ చైర్ పర్సన్ హేమలత గౌడ్, నర్సాపూర్ ఎమ్మెల్యే మదన్ రెడ్డిలతో కలిసి అయన పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం ముగ్గురు లబ్ధిదారులకు కల్యాణ లక్ష్మి చెక్కులను పంపిణీ చేశారు. స్థానిక ఉన్నత పాఠశాలను సందర్శించి 10వ తరగతి విద్యార్థులతో మాట్లాడి వార్షిక పరీక్షలకు సన్నద్దతపై పలు సూచనలు ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ స్వరూప నరేందర్ రెడ్డి, జెడ్పిటిసి రమేష్ గౌడ్, సర్పంచ్ వెంకటలక్ష్మి, శ్రీనివాస్ రెడ్డి, ముదిరాజ్ సంఘం అధ్యక్షులు స్వామి తదితరులు పాల్గొన్నారు.