ఆయిల్ ఫామ్ సాగుకు రైతులు ముందుకు రావాలి: జిల్లా కలెక్టర్ యాస్మిన్ భాష

ఆయిల్ ఫామ్ సాగుకు రైతులు ముందుకు రావాలి: జిల్లా కలెక్టర్ యాస్మిన్ భాష
Farmers should come forward for oil farm cultivation: District Collector Yasmin Bhasha

ముద్ర ప్రతినిధి,  జగిత్యాల: ఆయిల్ ఫామ్ సాగుకు రైతులు ముందుకు రావాలని జిల్లా కలెక్టర్ యాస్మిన్ భాష, జగిత్యాల ఎమ్మెల్యే డా. సంజయ్ కుమార్ పిలుపునిచ్చారు. జగిత్యాల మండలంలోనీ అంతర్గామలో రైతులు నక్కల రవీందర్ రెడ్డి, ఎల్లాల లక్ష్మారెడ్డి కి చెందిన 5 ఎకరాల తోటల్లో ఎమ్మెల్యే, జిల్లా పరిషత్ చైర్పర్సన్ దావ వసంత, జిల్లా కలెక్టర్ యాస్మిన్ భాషతో కలిసి ఆయిల్ ఫామ్ మొక్కలను నాటారు.ఈ  సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ జగిత్యాల జిల్లాలో 43 ఎకరాల అయిల్ పాం మొక్కలు నాటాలని టార్గెట్ ఉందని. అందుకోసం ఉద్యానవన వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో 1200 మంది రైతులను సమన్వయం చేసి వారితో డీడీలు కట్టించడం జరిగిందని మూడు నెలల్లో టార్గెట్ పూర్తి చేస్తామని కలెక్టర్ పేర్కొన్నారు. ప్రభుత్వమే రైతులకు  ఫ్రీగా  డ్రిప్ ఇరిగేషన్ మంజూరు ఇస్తుందని.  తక్కువ ఖర్చుతోనే పంటలు సాగు చేసుకోవచ్చని కలెక్టర్ సూచించారు. అనుకూలమైన స్థలాలను రైతులు ఉపయోగించుకోవాలని కలెక్టర్ కోరారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ రాజేంద్రప్రసాద్ , ఏఎంసీ చైర్మన్ నక్కల రాధా, బి ఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షుడు బాల ముకుందం, సర్పంచ్ నారాయణ జిల్లా వ్యవసాయ అధికారి సురేష్ ఎంపీవో రవిబాబు, ఎంపీడిఓ రాజేశ్వరి తదితరులు పాల్గొన్నారు.