ఈపిఎస్ 95 పెన్షన్ దారుల సమస్యలు పరిష్కరించాలి జిల్లా అధ్యక్షుడు జహీరుద్దీన్

ఈపిఎస్ 95 పెన్షన్ దారుల సమస్యలు పరిష్కరించాలి జిల్లా అధ్యక్షుడు జహీరుద్దీన్

ముద్ర ప్రతినిధి, మెదక్: ఆర్టీసీ, ఇతర ప్రభుత్వరంగ సంస్థల ఈపీఎస్ పెన్షన్ దారుల సమస్యలను పరిష్కరించాలని జాతీయ సంఘర్షణ సమితి జిల్లా అధ్యక్షులు యండి. జహీరుద్దీన్  డిమాండ్ చేశారు. బుధవారం మెదక్ డిపో ఎదుట ప్రధాన రహదారిపై తమ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ రాస్తారోకో నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ సుప్రీంకోర్టు ఉత్తర్వుల ప్రకారం కాకుండా ఈపీఎఫ్ఓ పేరా నెంబర్ 26(6) నిబంధనలు పెట్టి సభ్యులను అయోమయానికి గురి చేస్తుందని ఆరోపించారు. జిల్లాలో ఇంతవరకు ఈపీఎఫ్ఓ వెబ్ సైట్లు తెరుచుకోవడంలేదని ఆరోపించారు. పెన్షన్ దారులకు అధిక పెన్షన్ పొందకూడదనే లేని నిబంధనలను పెట్టి అనర్హతకు గురి చేస్తుందన్నారు. నిబంధనలు లేకుండా అందరికీ కనీస పెన్షన్ కరువు భత్యంతో రూ. 7500 లకు పెంచాలని, పెన్షనర్ల భార్యాభర్తలకు ఉచిత వైద్యసౌకర్యాలను కల్పించాలని డిమాండ్ చేశారు. ఈపిఎస్ 95 పెన్షన్ దారులందరికి పెన్షన్, డిఏ, వైద్య సదుపాయాలను కల్పించాలన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర పబ్లిసిటీ కార్యదర్శి యస్.కే.మూర్తి, రాష్ట్ర సహాయ కార్యదర్శి బి.సుబ్బారావ్,
డిపో అధ్యక్ష,కార్యదర్శులు కే.రాజానందం, ఆర్. సిద్దిరాములు ఉన్నారు.