పోలీస్ అధికారులకు సాఫ్ట్ స్కిల్ డెవలప్మెంట్ పై వర్క్ షాప్

పోలీస్ అధికారులకు సాఫ్ట్ స్కిల్ డెవలప్మెంట్ పై వర్క్ షాప్

ముద్ర ప్రతినిధి, మెదక్:పోలీస్ అధికారులకు సాఫ్ట్ స్కిల్ డెవలప్మెంట్ పై వర్క్ షాప్ మంగళవారం నిర్వహించారు. దీపివోలో రిటైర్డ్ ఐజిపి ఆనంద్  వర్ధన్ శుక్ల ఆయా అంశాలపై సూచనలు చేశారు. ప్రతి పోలీస్ అధికారికి ప్రజల సమస్యలు సామరస్యంగా ఓర్పు సహనంతో వినడం, బాధ్యతగా వివరించడం, సమస్యను తీర్చడం చాలా ముఖ్యమని తెలిపారు. పోలీస్ స్టేషన్కు వచ్చే ప్రజలందరూ మా పోలీసులు మాకు రక్షణ కల్పిస్తారు, బాధ్యతగా వ్యవహరిస్తారు అనే నమ్మకం చాలా ముఖ్యమన్నారు. ప్రజల అంచనాలకు తగ్గట్లుగా  పోలీసులు స్కిల్ డెవలప్మెంట్ చేసుకోవాలన్నారు. కమ్యూనిటీ పోలీసింగ్ ద్వారా సేవలందించాలన్నారు. ధనిక, పేద అనే తేడా లేకుండా పోలీస్ స్టేషన్కు వచ్చే ప్రతి ఫిర్యాదుదారున్ని సమానంగా చూడాలన్నారు. వృత్తిపరంగా ముఖ్యమైన వ్యక్తిగత లక్షణాలు, కమ్యూనికేషన్ సామర్థ్యాలు మొదలైన వాటిపై బాగా ప్రభావితం చేస్తాయన్నారు.జిల్లా ఎస్.పి.రోహిణి ప్రియదర్శిని, అదనపు ఎస్.పి.మహేందర్, మెదక్ డి.ఎస్.పిలు ఫణీంద్ర, యాదగిరి రెడ్డి, శ్రీనివాస్ రెడ్డి, సుభాష్ చంద్రభోస్, జిల్లా సి.ఐలు ఎస్.ఐ.లు సిబ్బంది పాల్గొన్నారు.