కాంగ్రెస్ పార్టీ గెలుపు కోసం కార్యకర్తలు సైనికుల పనిచేయాలి

కాంగ్రెస్ పార్టీ గెలుపు కోసం కార్యకర్తలు సైనికుల పనిచేయాలి
  • టిపిసిసి ఉపాధ్యక్షులు సురేష్ శెట్కార్      

పెద్దశంకరంపేట, ముద్ర: శాసనసభ ఎన్నికల్లో నారాయణఖేడ్ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ గెలుపు కోసం కార్యకర్తలు, నాయకులు సైనికుల పనిచేయాలని పిపిసిసి ఉపాధ్యక్షులు సురేష్ శెట్కార్ పిలుపునిచ్చారు. సోమవారం పెద్ద శంకరంపేటలో బాయికాడి పద్మయ్య ఫంక్షన్ హాల్ లో నిర్వహించిన మండల స్థాయి కాంగ్రెస్ కార్యకర్తల సమావేశంలో ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీ బలోపేతం కోసం తన టికెట్ ను త్యాగం చేసి సంజీవరెడ్డికి ఇప్పించడం జరిగిందన్నారు. నారాయణఖేడ్ నియోజకవర్గ స్థాయిలో అందరూ విభేదాలు వీడి కాంగ్రెస్ పార్టీ గెలుపు కోసం కృషి చేయాలని పిలుపునిచ్చారు. స్థానిక ఎమ్మెల్యే  స్థానిక ప్రజాప్రతినిధులు భూ కబ్జాలకు పాల్పడుతున్న విషయం అందరికీ తెలుసని ఆయన వివరించారు.  బిఆర్ఎస్ ప్రభుత్వం ధరణి పేరుతో రైతులకు ఎన్నో ఇబ్బందులకు గురిచేస్తుందన్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే ధరణి ఓట్లను రద్దు చేస్తామన్నారు.

కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఆరు గ్యారెంటీలను అధికారంలోకి రాగానే అమలు చేస్తామని, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నాయకులు ఇంటింటికి తిరిగి ఆరు గ్యారెంటీ ల గురించి ప్రతి ఒక్కరికి వివరించాలన్నారు.  అనంతరం నారాయణఖేడ్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి సంజీవరెడ్డి మాట్లాడుతూ ధనీక రాష్ట్రంగా ఉన్న తెలంగాణను అప్పుల రాష్ట్రంగా మిగిల్చిన ఘనత బి ఆర్ ఎస్ ప్రభుత్వానికి దక్కుతుందన్నారు.  గత 60 సంవత్సరాల కాంగ్రెస్ పాలనలో ఎన్నో సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టామని ఆయన అన్నారు. ప్రస్తుత బిఆర్ఎస్ పార్టీ నాయకులు  రాణి శంకరమ్మ భూములను, ప్రభుత్వ భూములను కాజేసి పేద రైతుల పొట్ట కొట్టి రిజిస్ట్రేషన్ చేసుకుంటున్నారని విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగాలని పేదవారికి తిరిగి ఆ భూములను ఇప్పిస్తామన్నారు.   తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి కాంగ్రెస్ పార్టీ వస్తుందని, నారాయణఖేడ్ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీకి అత్యధిక మెజారిటీతో ఓట్లు వేసి ప్రజలు గెలిపించాలని ఆయన కోరారు.  ఈ కార్యక్రమంలో నియోజక వర్గం నాయకులు రాకేష్ శెట్కర్, పేట సర్పంచ్ అలుగుల సత్యనారాయణ, కర్ణ శ్రీనివాస్, మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు రాయిని మధు, దానంపల్లి నారాగౌడ్,  రాజేందర్ గౌడ్,  దాచ సంగమేశ్వర్,  అంజిరెడ్డి,  జైహింద్ రెడ్డి, ఎంపీటీసీ రాజు నాయక్, ఆయా గ్రామాల కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నాయకులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.