నిస్సహాకుడికి రెడ్ క్రాస్ చేయూత

నిస్సహాకుడికి రెడ్ క్రాస్ చేయూత
  • రెండు చేతులు అమర్చి సహాయం

ముద్ర ప్రతినిధి, మెదక్: ప్రమాదవశాత్తు రెండు చేతులు కోల్పోయిన బాధితుడికి ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ చేయయూతనందించింది. కృతిమ రెండు చేతులను అమర్చి ఆసరా అయ్యింది.  మెదక్ జిల్లా రామాయంపేట పట్టణానికి చెందిన నందిరి రవికి 8 నెలల క్రితం విద్యుదాఘాతంతో రెండు చేతులు కోల్పోయాడు. దీంతో కనీస అవసరాలు తీర్చుకోలేని పరిస్థితి ఏర్పడింది. ఇది గమనించిన ఇండియన్ రెడ్డి క్రాస్ సొసైటీ మెదక్ జిల్లా చైర్మన్ డా.ఏలేటి రాజశేఖర్ రెడ్డి స్పందించి ఈనాలి ఫౌండేషన్, పూణే రోటరీ క్లబ్ జూబ్లీహిల్స్ ఆధ్వర్యంలో మహాబాబ్ జూనియర్ కాలేజ్  సికింద్రాబాద్ లో నిర్వహించిన శిబిరానికి తీసుకెళ్లారు. ప్రాస్ర్తాటిక్ హాండ్స్ ను ఉచితంగా అమర్చారు.   అక్టోబర్ 26న రవిని తీసుకునిపోగా, కొలతలు తీసుకుని ఆదివారం కృతిమ రెండు చేతులను అమర్చారు. ప్రస్తుతం మెల్లిమెల్లిగా రోజువారీ దినసరి పనులు చేసుకుంటున్నాడు. 

గ్రహించిన సామాజిక కార్యకర్త

నందిరి రవి తన రోజువారి దిన సరి కార్యక్రమాలను కూడా చేసుకోలేని దుస్థితిని గ్రహించిన సామాజిక సేవ కార్యకర్త  మిట్టదొడ్డి సుగుణ రెడ్ క్రాస్ మెదక్ శాఖ చైర్మన్ లయన్ డాక్టర్ ఏలేటి రాజశేఖర్ రెడ్డి దృష్టకి తీసుకెళ్లారు. పలు సేవా సంస్థలను, సేవారంగంలో ఆర్తులకు సేవలందిస్తున్న ప్రముఖులకు,సంప్రదించి, వినతిపత్రాలను పంపగా రోటరీ క్లబ్ ఆఫ్ జూబ్లీహిల్స్ సహకారంతో క్లబ్ అధ్యక్షురాలు రోటిరియన్ జ్యోతి రెడ్డి, కార్యక్రమ నిర్వాకులు రొటీరియన్ లక్ష్మి, శ్రీదేవి రాజేష్, గోపిరెడ్డి, నారాయణరావుల సహకారంతో ఈ ప్రాస్టటిక్ హ్యాండ్స్ ఉచిత పంపిణీ శిబిరంలో రెండు చేతులను అమర్చారు. 

రవి ముఖంలో సంతోషం

కాగా గత 8 మాసాలుగా కనీస అవసరాలను కూడా చేసుకోలేని రవిని చేతులు అమర్చిన తర్వాత అతని సంతోషాన్ని, కుటుంబంతో పంచుకోవడం చాలా సంతోషకరంగా ఉందని రెడ్ క్రాస్ మెదక్ శాఖ సభ్యులు చాలా సంతోషాన్ని వ్యక్తం చేశారు. ఇటువంటి సేవా కార్యక్రమాలను ఇకముందు కూడా కొనసాగిస్తామని, శక్తి వంచన లేకుండా ఆర్తులకు, అవసరం ఉన్నవారికి ఆరోగ్య శిబిరాలు, రక్తదాన శిబిరములు, పర్యావరణ కార్యక్రమాలను కొనసాగిస్తామని చైర్మన్ రాజశేఖర్ రెడ్డి తెలిపారు.