వన దుర్గామాతను దర్శించుకున్న కలెక్టర్ రాజర్షి షా

వన దుర్గామాతను దర్శించుకున్న కలెక్టర్ రాజర్షి షా

ముద్ర ప్రతినిధి, మెదక్: జిల్లా కలెక్టర్ రాజర్షి షా సోమవారం ఏడుపాయల వన దుర్గ మాత అమ్మవారిని దర్శించుకున్నారు. తీర్థ ప్రసాదాలు అందజేయగా, చైర్మన్ బాలగౌడ్ శాలువాతో సత్కరించారు. అనంతరం ఏడుపాయల జాతర సందర్బంగా వివిధ శాఖల ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఏర్పాట్లను పరిశీలించి అధికారులకు తగు సూచనలు ఇచ్చారు. మంజీరా నదీ పాయల వద్ద ఏర్పాట్లు పరిశీలించారు. వెంట చిత్రంలో జెడ్పి సీఈఓ శైలేశ్, ఆర్డీఓ సాయి రామ్, మిషన్ భగీరత ఈఈ కమలాకర్, మత్స్య శాఖ ఎడి  రజిని, ఆలయ  ఈఓ శ్రీనివాస్ తదితరులున్నారు.

ఏడుపాయల వన దుర్గ మాత మహా జాతర మూడవరోజు రద్దీ కొనసాగుతోంది. సోమవారం తెల్లవారుజాము నుండి భక్తులు మంజీరా నది పాయల్లో పుణ్యస్నానాలు ఆచరించి అమ్మవారి దర్శనం కోసం బారులు తీరారు. ఉదయం నుండి అమ్మవారికి ఒడిబియ్యం, బోనాలు సమర్పిస్తున్నారు. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయం ప్రతిబింబించేలా కోలాహలం నెలకొంది. ఈరోజు రాత్రి రథోత్సవంతో జాతర ముగియనుంది.