మండల, పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుల నియామకం

మండల, పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుల నియామకం
  • మెదక్ డీసీసీ అధ్యక్షులు తిరుపతి రెడ్డి

ముద్ర ప్రతినిధి, మెదక్:మెదక్ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ 6 మండలాలు, 2 పట్టణాలకు నూతనంగా అధ్యక్షల నియామకాలు  చేపడుతూ పీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి ఆదేశించారని జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు కాంటారెడ్డి తిరుపతి రెడ్డి ప్రకటించారు. పాపన్నపేట- బి.గోవింద్ నాయక్, చిన్న శంకరంపేట- పి.రమణ, రామయంపేట మండలం-బి.శంరెడ్డి, రామయంపేట పట్టణం- సి.యాదగిరి, మెదక్ మండలం-కె.శంకర్, మెదక్ పట్టణం- జి. ఆంజనేయులుగౌడ్, హవెలి ఘనపూర్ మండలం- యల్. శ్రీనివాస్, నిజాంపేట- బి. లింగం గౌడ్ లను నియమిస్తూ పీసీసీ ఉపాధ్యక్షులు మల్లు రవి ఉత్తర్వులు జారీ చేశారని వివరించారు.