రెడ్ క్రాస్ ఆధ్వర్యంలో పేద కుటుంబానికి సాయం

రెడ్ క్రాస్ ఆధ్వర్యంలో పేద కుటుంబానికి సాయం

ముద్ర ప్రతినిధి, మెదక్:ఇటీవల కురిసిన భారీ వర్షాలకు దెబ్బతిన్న ఇళ్ళ బాధితులకు రెడ్ క్రాస్ సొసైటీ తన వంతు సహాయం అందిస్తుంది. మెదక్ చర్చ్ కంపౌండ్ లో  టి.పల్స్ కుమార్ పేద, వృద్ధ దంపతుల ఇల్లు దెబ్బ తిన్నందున ఇండియన్ రెడ్ క్రాస్  సొసైటీ, మెడక్ జిల్లా శాఖ ద్వారా టార్పాలిన్ షీటు, అన్ని నిత్యవసర సరుకులను మంగళవారం అందజేశారు. ఈ కార్యక్రమంలో మెదక్ జిల్లా రెడ్ క్రాస్ అధ్యక్షులు లయన్ డా.ఏలేటి రాజశేఖర్ రెడ్డి,  కార్యదర్శి టి.సుభాష్ చంద్ర బోస్, కోశాధికారి డి.జి.శ్రీనివాస్ శర్మ, ఈ.సి.మెంబెర్స్ దేమే యాదగిరి, వి. కైలాసం, తిరుమల శేషాచారి, చర్చ్ కాంపౌండ్  సభ్యులు పాల్గొన్నారు.