మరో 1200 గృహాలకు ఇండ్ల పట్టాలు

మరో 1200 గృహాలకు ఇండ్ల పట్టాలు
  • ప్రభుత్వ బాల్క సుమన్

రామకృష్ణాపూర్,ముద్ర : పట్టణంలో జీవో నెంబర్ 76 ద్వారా దరఖాస్తు చేసుకొని సర్వేలో మిస్ అయిన ఏరియాల లోని 1200 గృహాలకు ఇండ్ల పట్టాలు అందనున్నట్లు చెన్నూరు ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ బాల్క సుమన్ తెలిపారు. మంగళవారం హైదరాబాద్ లోని సింగరేణి భవన్లో మందమర్రి, రామకృష్ణాపూర్ సింగరేణి వార్డులలోని సీసీ,బీటీ రోడ్లు,డ్రైనేజీ, సానిటేషన్ సంబంధించిన పలు సమస్యలపై సిఅండ్ఎండి శ్రీధర్ తో కలిసి విప్ మాట్లాడారు. ఈ సందర్బంగా రామకృష్ణాపూర్ పట్టణంలోని భగత్ సింగ్,రాజీవ్,శివాజీ,జవహర్, శ్రీనివాస్,మల్లికార్జున్ నగర్లతో పాటు గంగా కాలనీ,విద్యానగర్, ఆర్కే ఫోర్ గడ్డ, పోస్ట్ ఆఫీస్ లైన్లకు చెందిన భూములను క్రమబద్దీకరణ చేసేందుకు రెవెన్యూ శాఖకు అప్పగించాల్సిందిగా సింగరేణి సంస్థ సిఅండ్ఎండి ఎన్.శ్రీధర్ ను విప్ బాల్క సుమన్ కోరారు. భూముల క్రమబద్దీకరణతో ఆ ప్రాంతంలోని మరో 1200 మంది ఇండ్లకు పట్టాలు అందుతాయని పేర్కొన్నారు. అలాగే రెండో వార్డు జ్యోతి నగర్లో  నిర్మించనున్న కేసీఆర్ అర్బన్ ఎకో పార్క్ కోసం సింగరేణి నుంచి 30 ఎకరాల భూమిని అప్పగించాలని విజ్ఞప్తి చేశారు. సంబంధిత అంశాలపై సిఅండ్ఎండి  శ్రీధర్ సానుకూలంగా స్పందించినట్లు విప్ తెలిపారు.