ట్రైన్ ఢీకొని యువకుడు మృతి

ట్రైన్ ఢీకొని యువకుడు మృతి

తూప్రాన్, ముద్ర: ట్రైన్ కు ఎదురెల్లి ఆత్మహత్యకు పాల్పడి యువకుడు మృతిచెందిన సంఘటన మాసాయిపేటలో చోటుచేసుకుంది. కామారెడ్డి రైల్వే ఎస్ఐ తావు నాయక్ కథనం ప్రకారం మాసాయిపేట గ్రామానికి చెందిన తలారి లక్షణ్ కుమారుడు తలారి  సాయికుమార్(23) సోమవారం రాత్రి మాసాయిపేట వడియారం రైల్వె ట్రాక్ పై ట్రైన్ ఢీకొని మృతిచెందినట్లు తెలిపారు. మృతదేహాన్ని రైల్వె హాస్పిటల్ కు తరలించినట్లు అయన తెలిపారు. మృతికి గల కారణాలు తెలియాల్సి ఉంది.