Budget 2023 Highlights: సప్తరుషుల.. ప్రాధాన్యం బడ్జెట్లో?

Budget 2023 Highlights: సప్తరుషుల.. ప్రాధాన్యం బడ్జెట్లో?
Budget of Nirmala Sitharaman

న్యూఢిల్లీ: నిర్మలా సీతారామన్​ బడ్జెట్​ విడుదల సందర్భంగా బుధవారం మాట్లాడుతూ.. సప్తరుషులను దృష్టిలో ఉంచుకొని బడ్జెట్​ను విడుదల చేస్తున్నామన్నారు. 
1. కిసాన్​ సమ్మాన్​ నిధి పెంపు, వ్యవసాయ రంగం సవాళ్ళను ఎదుర్కోవడం, చిరుధాన్యాల పంటలకు ప్రోత్సాహకాలు, రైతులకు ప్రోత్సాహకాలు వ్యవసాయ రంగంలో నూతన పోకడలు, కరువు ప్రాంత రైతులకు సహకారం.. మొత్తంగా వ్యవసాయ రంగానికి సంబంధించి ప్రభుత్వం చేస్తున్న కృషిని ‘మొదటి రుషి’గా పేర్కొనవచ్చు.

2. సూదూర లక్ష్యాలను దృష్టిలో ఉంచుకొని 2047 అమృతకాల వికాస్​గా పేర్కొన్నారు. ఆయా పథకాల రూపకల్పన, సాంకేతిక రంగాల అభివృద్ధి, హరితాభివృద్ధి, విద్యా, వైద్య, మత్య్స, విద్యుత్​ తదితర రంగాలను ‘రెండో రుషి’గా చూడొచ్చు.

3. పేదల సంక్షేమం కోసం విభిన్న అభివృద్ధి పథకాలు తీసుకొని రావడం, వారి ఆర్థికాభివృద్ధికి తోడ్పాటునందించడం, విద్యారంగంలో వారికి అపార అవకాశాలు కల్పించేందుకు నూతన విద్యాలయాలు ప్రారంభించడం తద్వారా ప్రతీ ఒక్కరికి విద్యనందించడం.. నిరుద్యోగిత తగ్గించడం.. ఇక లైబ్రరీల డిజిటల్​ చేయడం ద్వారా గిరిజన, ఆదివాసీ ప్రాంతాల్లోని వ్యక్తులను సాంకేతికతతో జోడించడం, మహిళా సంఘాల కోసం సెల్ఫహెల్ప్​ గ్రూపులకు ప్రోత్సాహకాలు తదితరాలు ‘మూడో రుషి’గా చెప్పొచ్చు.

4. రైల్వే, ఫార్మా (రవాణా, వైద్య) రైల్వేకు 2.40 లక్షల కోట్ల భారీ బడ్జెట్​ కేటాయించారు. దీని ద్వారా దేశంలోని ఏ మూల నుంచి ఏ మూలకైనా అత్యంత తక్కువ సమయంలో వెల్లడం ద్వారా సమయ ప్రాధాన్యతను అర్థం చేసుకోవడం. ప్రభుత్వ, ప్రైవేటు, ప్రజారోగ్యమే లక్ష్యంగా పరిశోధన శాలల ఏర్పాటు, మెడికల్​ కాలేజీలు, నర్సింగ్​కాలేజీల ఏర్పాటు, వ్యాధిగ్రస్థులకు తోడ్పాటు అందించడాన్ని ‘నాలుగో రుషి’గా పేర్కొనవచ్చు.

5. వడ్డీ లేని రుణాల ద్వారా నిరుపేదల అభ్యున్నతికి, అభివృద్ధికి తోడ్పడడం, ఆయా రంగాల్లో భారీగా కేటాయింపులు చేయడంతో, దేశంలోని మారుమూల ప్రాంతాల్లో కూడా ఈ ఫలితాలు అందేలా చూడడం వల్ల ప్రతీ ఒక్కరికి లబ్ధి చేకూరడాన్ని ‘ఐదో రుషి’గా చెప్పొచ్చు.

6. ఇక దేశ ఆర్థిక పురోభివృద్ధికి విశేషంగా తోడ్పాటునందిస్తున్న చిన్న, మధ్య, కుటీర తరహా పరిశ్రమలకు ప్రోత్సాహకాలు ఇవ్వడం వల్ల, కోవిడ్​ లాంటి కష్ట సమయాల్లో వారు చెల్లించిన పన్నుల మొత్తాన్ని (గణాంకాల్లో తేడా) తిరిగి చెల్లించడం, ఈ కోర్టుల ద్వారా కేసుల పరిష్కారాలు తదితరాలతో దేశార్థికాభివృద్ధిలో భాగస్వాములైన ప్రతీ ఒక్కరికి తోడ్పాటు నందించడాన్ని ‘ఆరో రుషి’గా చూడొచ్చు.

7. ఇక చివరలో మౌలిక సదుపాయల కల్పన. ఉద్యోగుల నైపుణ్యాభివృద్ధిని పెంపొందించడం, పలు ప్రాజెక్టులు, రోడ్ల అభివృద్ధి కోసం నిధులు కేటాయించడం, సాగు, వైద్యం, విద్య, ఎగుమతులు దిగుమతులు, అవార్డులు, రివార్డులు ఇలా అన్ని అంశాలపై కూలంకషంగా దేశాభివృద్ధి, సంక్షేమం, ప్రజా శ్రేయస్సును ఆలోచిస్తూ చేపడుతున్న పనులను చిట్ట చివర ‘ఏడో రుషి’గా పేర్కొనవచ్చు.
ఇది సప్తరుషుల సంగమం.