మంత్రి హరీష్ రావు సమక్షంలో అల్లాదుర్గం మాజీ జెడ్పిటిసి చేరిక

మంత్రి హరీష్ రావు సమక్షంలో అల్లాదుర్గం మాజీ జెడ్పిటిసి చేరిక

పెద్దశంకరంపేట, ముద్ర: అల్లాదుర్గం మండల మాజీ జెడ్పిటిసి సభ్యులు మమతా బ్రహ్మం శుక్రవారం ఆర్థిక మంత్రి హరీష్ రావు, అందోల్ ఎమ్మెల్యే క్రాంతి కిరణ్, ఎమ్మెల్సీ ఫారూఖ్ హుస్సేన్, టి ఎస్ ట్రేడింగ్ కార్పొరేషన్ కార్పొరేషన్ చైర్మన్ బిక్షపతి, సంగారెడ్డి జిల్లా జడ్పీ చైర్మన్ మంజుశ్రీ జయపాల్ రెడ్డి, సమక్షంలో  బీ అర్ ఎస్ పార్టీ లో చేరారు. మంత్రి హరీష్ రావు, జెడ్పిటిసి మమతా బ్రహ్మం కు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. బిఆర్ఎస్ పార్టీ ఆవిర్భావం నుంచి బ్రహ్మం బిఆర్ఎస్ కార్యకర్తగా, బిఆర్ఎస్ మండల అధ్యక్షులుగా చురుకుగా పాల్గొంటూ తెలంగాణ ఉద్యమంలోతన వంతు పాత్ర పోషించారు. తెలంగాణ సాధనలో ముఖ్యమంత్రి కేసీఆర్ తో నడిచిన బ్రహ్మం, 2014 నుంచి 2019 వరకు జెడ్పిటిసిగా పనిచేశారు. గత కొన్ని నెలలుగా బిజెపి పార్టీలోకి వెళ్లిన ఆయన, ముఖ్యమంత్రి కేసీఆర్ తోనే తెలంగాణ అభివృద్ధి సాధ్యమని,  బడుగు బలహీన వర్గాల కోసం ముఖ్యమంత్రి, మంత్రి హరీష్ రావు లు అహార్నిశలు కృషి చేస్తున్నారని నమ్మి బీజేపీకి రాజీనామా చేసి బిఆర్ఎస్ పార్టీ లొ చేరినట్లు తెలిపారు. పార్టీ అభివృద్ధి కోసం, అందోల్ ఎమ్మెల్యే అభ్యర్థి క్రాంతి కిరణ్ గెలుపు కోసం నిబద్దత గల కార్యకర్తగా పని చేస్తానని తెలిపారు.మంత్రి హరీష్ రావు సమక్షంలో మాజీ జెడ్పిటిసి చేరిక