గురుకుల పాఠశాలలో నలుగురు పిల్లలు అవస్థతకు గురి..

గురుకుల పాఠశాలలో నలుగురు పిల్లలు అవస్థతకు గురి..
  • పిల్లలకు జ్వరం వచ్చిన పట్టించుకోని నర్సు..
  • కనీసం ఏ మాత్ర వేయాలో తెలియని నర్సు..

ముద్ర ప్రతినిధి సూర్యాపేట: సూర్యాపేట జిల్లా కోదాడ నియోజకవర్గంలోని నడిగూడెంలో తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో పిల్లలకు జ్వరం వచ్చిన పట్టించుకోని నర్స్, పిల్లలు జ్వరం వచ్చింది అని వెళ్తే కనీసం ఏ మాత్ర వెయ్యాలో తెలియని నర్సును పాఠశాల లో నియమించారు.నేడు నలుగురు పిల్లలు అస్వస్థతకు గురి అయ్యి కళ్ళు తిరిగి క్రింద పడిపోవడం తో ముగ్గురు పిల్లలను ప్రిన్సిపాల్ కారులో హాస్పిటల్ కి తీసుకెళ్లగా ఒక విద్యార్థినిని గవర్నమెంట్ హాస్పిటల్ కి బైక్ పై తీసుకెళ్లారు. పిల్లలకి జ్వరం వచ్చిన వైద్యం చెయ్యలేని నర్సును ఎలా నియమించారు.అంటూ విద్యార్థుల తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.ఇప్పటికి అయినా పై అధికారులు స్పందించి నిర్లక్ష్యం గా వ్యవహారిస్తున్నపాఠశాల సిబ్బంది. కనీస వైద్యం కూడా తెలియని నర్సుపై చర్యలు తీసుకోవాలని పిల్లలతల్లిదండ్రులు ఉన్నత విద్యాధికారులకు విజ్ఞప్తి చేస్తున్నారు.