టిఆర్ఎస్ పార్టీలో భారీ చేరికలు

టిఆర్ఎస్ పార్టీలో భారీ చేరికలు
  • తుంగతుర్తి నియోజకవర్గంలో మూడోసారి గులాబీ జెండా ఎగరడం ఖాయం
  • ముఖ్యమంత్రిగా మూడోసారి కెసిఆర్ అవడం తథ్యం
  • ఎమ్మెల్యే డాక్టర్ గాదరి కిషోర్ కుమార్

తుంగతుర్తి ముద్ర: తుంగతుర్తి నియోజకవర్గంలో బి ఆర్ ఎస్ పార్టీ ఆధ్వర్యంలో సాగుతున్న అభివృద్ధి సంక్షేమ పథకాల పట్ల విపక్ష పార్టీల నాయకులు కార్యకర్తలు ఆకర్షితులై టిఆర్ఎస్ పార్టీలోకి పెద్ద ఎత్తున చేరుతున్నారని ఇది సంతోషకరమని తుంగతుర్తి శాసనసభ్యుడు డాక్టర్ గాదరి కిషోర్ కుమార్ అన్నారు .గురువారం తుంగతుర్తి నియోజకవర్గం అరవపల్లి మండలం జాజిరెడ్డిగూడెం గ్రామానికి చెందిన పలువురు కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు ఆ పార్టీకి రాజీనామా చేసి ఎమ్మెల్యే సమక్షంలో గులాబీ కండువాలు కప్పుకున్నారు .ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ తుంగతుర్తి నియోజకవర్గంలోని ప్రతి గ్రామంలో ప్రతి ఇంటికి  బిఆర్ఎస్ పార్టీ చేస్తున్న అభివృద్ధి సంక్షేమ పథకాలు ఏదో ఒక రూపంలో అందుతున్నాయని అందుకే ప్రజలు టిఆర్ఎస్ పక్షాన ఉన్నారని అన్నారు. రాష్ట్రంలో, నియోజకవర్గంలో జరుగుతున్న అభివృద్ధిని చూసి ఓర్వలేక విపక్ష పార్టీలు అసత్య ప్రచారాలు అసంబద్ధ మాటలు మాట్లాడుతున్నారని అయినా ప్రజలు వారిని నమ్మే పరిస్థితిలో లేరని అన్నారు.

ఎన్నికల సమీపిస్తున్న వేళ నియోజకవర్గంలోకి అనేకమంది వివిధ రకాల పార్టీలనుండి రావడం పరిపాటిగా మారిందని కేవలం ఎన్నికల నాడు వచ్చి అభివృద్ధి చేస్తున్న వారిపై బురద చల్లడమే వారి పని అని గడచిన 9 సంవత్సరాల కాలంలో వారు చేస్తున్న పని అదేనని అన్నారు .మొదటిసారి ,రెండవసారి అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలు వారిని చీకొట్టిన ఇంకా బుద్ధి రాలేదని మూడోసారి రానున్న ఎన్నికల్లో ప్రజలు అసత్య ప్రచారాలు చేసే వారిని, అభివృద్ధి నిరోధకులను తరిమికొట్టడం ఖాయమని ఎమ్మెల్యే అన్నారు. తుంగతుర్తి నియోజకవర్గంలో ముచ్చటగా మూడోసారి గులాబీ జెండా ఎగురుతుందని రాష్ట్రంలో మరో    మారు కేసీఆర్ ముఖ్యమంత్రి అవుతారని ఎమ్మెల్యే ధీమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన వార్డు మెంబర్ కమటం రాజు, కమటం రవి, నర్సింగ శోభన్ ,సుమన్ ,సైదులు ,లక్ష్మయ్య, నగేష్, సంతోష్ ,ఎండి గౌస్ ,శ్రీకర్ ,యాకూబ్ పూలమ్మలతోపాటు సుమారు 150 మంది కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి టిఆర్ఎస్ పార్టీలో చేరారు.