పేద మహిళల అభివృద్ధి తమ ధ్యేయం

పేద మహిళల అభివృద్ధి తమ ధ్యేయం
  • కుట్టు మిషన్ శిక్షణ ద్వారా ఉపాధి అవకాశాలు-మంత్రి హరీష్ రావు

ముద్ర, నంగునూరు:మండలంలోని నిరుపేద మహిళల కోసం కుట్టు శిక్షణను అందించి వారికి ఉపాధి అవకాశాలు అందించేలా కృషి చేస్తున్నట్లు రాష్ట్ర మంత్రి హరీష్ రావు అన్నారు. బుధవారం నాడు సిద్దిపేట జిల్లా నంగునూరు మండలం పాలమాకుల గ్రామంలో కార్డ్ స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో రైతు వేదికలో కుట్టి శిక్షణ కేంద్రాన్ని ప్రారంభించారు. అనంతరం వెంకటాపూర్ లో రైతు వేదిక యాదవ కమ్యూనిటీ హాల్ ఓపెన్ జిమ్ ప్రకృతి వనం రెడ్డి కమ్యూనిటీ హాల్ ప్రారంభించగా వెంకటాపూర్ నుండి  మగ్గంపూర్ వరకు రోడ్డు పనులు గొర్ల షెడ్డు కు శంకుస్థాపన చేశారు. ఖానాపూర్ లో రజక కమ్యూనిటీ హాల్ ఫంక్షన్ హాల్ ప్రారంభించగా అంబేద్కర్ విగ్రహం ఏర్పాటు ఖానాపూర్ నుండి నాగరాజు పల్లి వరకు రోడ్డు నిర్మాణం నుంచి శంకుస్థాపన చేశార.

ఈ సందర్భంగా పాలమాకులలో ఆయన మాట్లాడుతూ  చిన్నతనంలో భర్తను కోల్పోయిన మహిళలు, వితంతువులు నిరుపేద మహిళల కోసం ఈ కుట్టు శిక్షణ కేంద్రాన్ని నిర్వహించడం జరిగిందన్నారు. ఈ శిక్షణ కేంద్రం ద్వారా శిక్షణ పొందిన మహిళలకు తాము కుట్టుమిషన్లను ఉచితంగా అందజేయడం జరుగుతుందన్నారు. మొదటగా తెలంగాణ కోసం పోరాడి ఎన్నో రోజుల తరబడి దీక్ష చేసిన పాలమాకులలో ప్రారంభించడం జరిగిందన్నారు. ఇదే తరహాలో ప్రతి  గ్రామానికి 20 నుండి 30 నిరుపేద మహిళలను గుర్తించి డాక్రా సంఘాల ద్వారా ఎంపిక చేసి శిక్షణ ఇవ్వడం జరుగుతుందన్నారు. మహిళలను గుర్తింపును బట్టి రెండో బ్యాచ్ను నిర్వహించేలా చూస్తామని హామీ ఇచ్చారు. మొదటగా అవివాహితులకు ప్రాధాన్యతనిస్తూ మహిళలకు ఎంతో ఈ శిక్షణ లాభదాయకం అన్నారు. ప్రభుత్వం రైతులకు ప్రోత్సాహాల అందిస్తూ ఆయిల్ ఫామ్ తోటలను అభివృద్ధి చేసేందుకు తోడ్పాటు అందిస్తుందని ఇది అందరూ సద్వినియోగం చేసుకోవాలన్నారు .నిరుపేద మహిళలు స్వసక్తితో ఎదగాలనే నా తపన అన్నారు. ఈ కార్యక్రమంలో జడ్పిటిసి తడిసిన ఉమా మాజీ ఎంపీపీ జాప శ్రీకాంత్ రెడ్డి రాష్ట్ర ఆయిల్ ఫామ్ ఉపాధ్యక్షుడు ఎడ్ల సోమిరెడ్డి నంగునూరు మార్కెట్ కమిటీ చైర్మన్ సారయ్య గ్రామ సర్పంచు లు పంగ కుమార్, రేకులపల్లి భాగ్యమ్మ, నాయకులు వేముల వెంకట్ రెడ్డి, మల్లయ్య ,ఎల్లంకి మహిపాల్ రెడ్డి, రవీందర్ రెడ్డి, పరమేశ్వర్, సతీష్, పురేందర్ తదితరులు పాల్గొన్నారు.