మహబూబాబాద్ పట్టణాన్ని సుందరంగా తీర్చి దిద్దుతాం... 

మహబూబాబాద్ పట్టణాన్ని సుందరంగా తీర్చి దిద్దుతాం... 

 రాష్ట్ర గిరిజన, స్త్రీ-శిశు సంక్షేమశాఖ మంత్రి సత్యవతి రాథోడ్.. 

ముద్రప్రతినిధి‌,మహబూబాబాద్: మహబూబాబాద్ మున్సిపాలిటీ ని ప్రజలకు ఉపయోగంగా, సుందరంగా తీర్చిదిద్దుతామని, అన్ని సౌకర్యాలు కల్పిస్తామని రాష్ట్ర గిరిజన సంక్షేమ, స్త్రీ-శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ తెలిపారు. మహబూబాబాద్ కలెక్టరేట్ లోని స్టేట్ ఛాంబర్ లో సోమవారం మహబూబాబాద్ పట్టణ అభివృద్ధి పై జిల్లా కలెక్టర్ శశాంక, జెడ్పి చైర్మన్ ఆంగోత్ బిందు, ఎమ్మెల్సీ తక్కెళ్లపల్లి రవీందర్ రావు, మహబూబాబాద్ శాసనసభ్యులు బానోత్ శంకర్ నాయక్, మున్సిపల్ చైర్మన్ డాక్టర్ పాల్వాయి రాంమ్మోహన్ రెడ్డి, వైస్ చైర్మన్ ఫరీద్ లతో పట్టణంలో చేపట్టవలసిన అభివృద్ధి పనులపై చర్చించారు.

రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ మహబూబాబాద్ పట్టణ అభివృద్ధి కి ప్రకటించిన 50 కోట్లలో శాశ్వత పనులకు 30 కోట్లు కేటాయించారు. ఆయా పనులకు స్థలాలను కూడా గుర్తించారు.  రహదారుల అభివృద్ధి, ఆర్చ్ లు, మినీ ట్యాంక్ బండ్, జంక్షన్ల అభివృద్ధి పనులను చేపట్టేందుకు ప్రణాళిక ఇవ్వాలని మున్సిపల్ అధికారులను ఆదేశించారు. వెజ్ అండ్ నాన్ వెజ్ మార్కెట్ ను పూర్తి చేసి ఏప్రిల్ లో ప్రారంభింప జేసేందుకు సిద్ధం చేయాలన్నారు.