తెలంగాణలో ప్రతిపేదవారికి అందుబాటులో కార్పోరేట్ వైద్యం.. 

తెలంగాణలో ప్రతిపేదవారికి అందుబాటులో కార్పోరేట్ వైద్యం.. 
  • మానుకోట ఆస్పత్రిలో 88 లక్షల 88వేలతో నిర్మించిన డిఈఐసి బ్లాక్ ను ప్రారంబించిన మంత్రి సత్యవతి రాథోడ్..
  • రేడియోల‌జీ ల్యాబ్ ను ప్రారంబించిన మంత్రి...

ముద్రప్రతినిధి, మహబూబాబాద్: తెలంగాణ రాష్ట్రంలో పేదలకు నాణ్యమైన కార్పొరేట్ వైద్యం అందుతుందని రాష్ట్ర గిరిజన, స్త్రీ-శిశుసంక్షేమశాఖలమంత్రి సత్యవతిరాథోడ్ అన్నారు. మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో బుదవారం దశాబ్ధిఉత్సవాలలో బాగంగా ఏరియా ఆసుపత్రిలో పలుఅభివృద్దిపనులను ఆమె ప్రారంబించారు. 

ఈ.. సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో మంత్రి సత్యవతిరాథోడ్ మాట్లాడుతూ...
సంపూర్ణ ఆరోగ్య తెలంగాణ సాధనలో భాగంగా రాష్ట్రంలో మహిళలు, శిశువులలో పోషకాహార లోపాన్ని నివారించేందుకు  సీఎం కేసీఆర్‌  విప్లవాత్మకమైన సంక్షేమ పథకాలను తీసుకువచ్చారన్నారు. ఆరోగ్యలక్ష్మీ, కేసీఆర్‌ కిట్‌తో బాల, బాలికల నిష్పత్తిలో తెలంగాణ దేశంలోనే మొదటి స్థానంలో నిలిచిందని గుర్తుచేసారు. మాతా, శిశు మరణాలు తగ్గడం రేటు దేశంలో అత్యధికంగా తెలంగాణలో నమోదైందని,షోపకాహార లోపాన్ని నివారించి, శిశువుల, మహిళల ఆరోగ్యాన్ని మెరుగుపర్చడానికి ఆరోగ్య వంతమైన పోషకాహారాన్ని అందించేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు సిద్ధం చేస్తోందని మంత్రి సత్యవతిరాథోడ్ తెలిపారు. 

గత ప్రభుత్వాలు వైద్య ఆరోగ్యం కోసం 4వెల కోట్లు ఖర్చు చేస్తే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 12వేల325 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తుందని తెలిపారు. దేశంలో ఎక్కడా లేనివిధంగా డయాలసిస్ బోధకాలకు పెన్షన్ అందిస్తున్న రాష్ట్రం తెలంగాణ రాష్ట్రమని అన్నారు.  ప్రభుత్వ ఆసుపత్రిలో రికార్డు స్థాయిలో నార్మల్ డెలివరీలు పెరిగాయని, మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో జనరల్ ఆస్పత్రిలో 24 గంటల్లో 19కాన్పులు చేసిన వైద్య బృందాన్ని ఈ సందర్భంగా మరోసారి అభినందిస్తున్నానని మంత్రి అన్నారు. తెలంగాణ వచ్చిన తర్వాత సీఎం కెసిఆర్ ప్రజారోగ్యం మీద దృష్టి సారించి మెరుగైన, నాణ్యమైన వైద్య సేవలందించేందుకు పూనుకున్నారని మంత్రి తెలిపారు. ఈ కార్యక్రమంలో మహబూబాబాద్ యంపి మాలోత్ కవిత,  శాసనసభ్యులు బానోత్ శంకర్ నాయక్, ఎమ్మెల్సీ తక్కెళ్ళపల్లి రవీందర్ రావు, జడ్పీ చైర్ పర్సన్ బిందు,  మున్సిపల్ చైర్మన్ డాక్టర్ పాల్వాయి రాంమ్మోహన్ రెడ్డి, వైస్ చైర్మన్ ఫరిద్, మెడికల్ కాలేజీ ప్రిన్సిపల్ వెంకటేశ్వర్లు ఇతర అధికారులు తదితరులు పాల్గొన్నారు.