ఘనంగా ఆవిర్భావ వేడుకలు

ఘనంగా ఆవిర్భావ వేడుకలు

కేసముద్రం/గూడూరు, ముద్ర: తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దశాబ్ది ఉత్సవాలు మహబూబాబాద్ జిల్లా కేసముద్రం, నెల్లికుదురు, గూడూరు, ఇనుగుర్తి మండలాల్లో శుక్రవారం ఘనంగా జరిగాయి. రాష్ట్ర అవతరణ వేడుకల సందర్భంగా ఆయా మండల కేంద్రాల్లో ప్రభుత్వ కార్యాలయాల వద్ద జాతీయ పతాకాలను ఆవిష్కరించారు. కేసముద్రం వ్యవసాయ మార్కెట్లో చైర్ పర్సన్ నీలం సుహాసిని దుర్గేష్, రెవెన్యూ ఆఫీసులో తహాసిల్దార్ సాంబశివుడు, ఎంపీడీవో ఆఫీసులో ఎంపీపీ చంద్రమోహన్, ఎంఈఓ ఆఫీసులో జగన్మోహన్ రెడ్డి, పోలీస్ స్టేషన్లో ఎస్సై తిరుపతి జాతీయ పతాకాలను ఆవిష్కరించారు.

అలాగే గూడూరు మండల పరిషత్ లో ఎంపీపీ సుజాత, రెవెన్యూ కార్యాలయంలో తహాసిల్దార్ అశోక్, ఫారెస్ట్ ఆఫీసులో ఎఫ్ ఆర్ ఓ సురేష్, పోలీస్ స్టేషన్లో సీఐ యాసిన్, ఎంఈఓ ఆఫీసులో ఎంఈఓ శ్రీదేవి జాతీయ పతాకాలను ఆవిష్కరించారు. నెల్లికుదురు మండల పరిషత్ లో ఎంపీపీ ఎర్రబెల్లి మాధవి, రెవెన్యూ ఆఫీసులో తహాసిల్దార్ యోగేశ్వరరావు, పోలీస్ స్టేషన్లో ఎస్ఐ క్రాంతి  కిరణ్, జూనియర్ కళాశాలలో ప్రిన్సిపల్ సదానందం, ఎంఈఓ ఆఫీస్ లో ఎంఈఓ రాము, ఇనుగుర్తి తహాసిల్ ఆఫీసులో తహసిల్దార్ మహమ్మద్ దిలావర్ అలీ జాతీయ పతాకాలను ఆవిష్కరించారు. అలాగే ఆయా మండలాల్లోని గ్రామాల్లో ప్రభుత్వ పాఠశాలలో ప్రైవేటు సంస్థల ఆధ్వర్యంలో తెలంగాణ ఆవిర్భావ వేడుకలు ఘనంగా నిర్వహించారు.